డిసెంబర్ లో విశాఖ నక్షత్రంలో శుక్రసంచారం.. ఈ ఐదు రాశుల పంట పండుతుంది!
2026 డిసెంబర్ 22న శుక్రుడు తన స్వరాశి అయిన తులలో విశాఖ నక్షత్రం గుండా సంచారం చేస్తాడు. విశాఖ నక్షత్రాధిపతి గురుడు. గురు, శుక్రులు సాధారణంగా పరస్పరం శత్రువులుగా పరిగణించబడతారు. కానీ జాతకంలో వీరి స్థానాలు బలంగా ఉంటే ఈ సంయోగం అదృష్టలక్ష్మిని ఇంటి ద్వారానికి తీసుకువస్తుంది. ఇంట్లో సంతోషం, ప్రశాంతత, పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి శ్రమకు మించిన ధనలాభం, అదృష్టం లభించే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి:
డిసెంబర్ నెల ఈ రాశి వారికి సువర్ణకాలంగా మారుతుంది. శుక్రుడి నక్షత్ర సంచారం అనూహ్య లాభాలు తెస్తుంది. ఇంట్లో నిలిచిపోయిన శుభకార్యాలు మళ్లీ ప్రారంభమవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి సమయం. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నంతో కోరుకున్న ఉద్యోగం దొరికే అవకాశం ఉంది.

కర్కాటక రాశి:
సంవత్సరాంతం ఈ రాశి వారికి ప్రశాంతత, సంతోషం తెస్తుంది. శుక్రుడి సంచారం అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది. గురుడు పాలించే నక్షత్రంలో శుక్రుడు సంచరించడం వల్ల ఆర్థిక బలం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. జీవితంలో పురోగతి కనిపిస్తుంది. ఇల్లు కొనాలనే కల నెరవేరే అవకాశం ఉంది. వృద్ధులు ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు రావచ్చు. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటుంది.
మిథున రాశి:
డిసెంబర్ నెల మిథున రాశి వారికి అనేక అవకాశాలు తెస్తుంది. గురుడు పాలించే నక్షత్రంలో శుక్ర సంచారం అనూహ్య లాభాలు కలిగిస్తుంది. దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిపర జీవితంపై మంచి ప్రభావం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పాత ప్రణాళికలు మళ్లీ కదులుతాయి.
తులా రాశి:
డిసెంబర్ నెల తులారాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. గురుడు పాలించే నక్షత్రంలో శుక్ర సంచారం తులా రాశి జాతకుల ఆర్ధిక ఇబ్బందులను తొలగిస్తుంది. ఈ సమయంలో తులారాశి జాతకులు కొత్త పనులు చేపట్టవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
కుంభ రాశి:
డిసెంబర్ నెలలో కుంభరాశి జాతకులకు కలిసి వశుంది. ఈ సమయం కుంభరాశి వారికి సకల శుభాలను చేకూరుస్తుంది. అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. కుంభరాశి జాతకులకు శని ప్రభావం నుండి కాస్త ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది. ఇది వీరికి కలిసొచ్చే కాలం.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications
