TTD: తిరుమలలో కొనసాగుతున్న వాచీలు, మొబైల్ ఫోన్ల ఈ వేలం.. శ్రీవారి సర్వదర్శనానికి సమయమిలా!!

కలియుగ ప్రత్యక్ష దైవం, కోరి కొలిచిన వారి కొంగు బంగారం, తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 81,465 మంది స్వామివారిని దర్శించుకుని తరించారు. 31,251 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక నిన్న శ్రీవారి ఉండి ఆదాయం 3.67 కోట్లుగా ఉంది.

ప్రత్యేక దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే
ప్రస్తుతం 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ ఎస్ఎస్దీ దర్శనం కోసం ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇదిలా ఉంటే జూన్ 24వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన టిటిడి ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేసింది.

TTD The ongoing auction of watches and mobile phones in Tirumala 18 hours for Sarva Darshan

తిరుమలలో వాచీలు, మొబైల్ ఫోన్స్ ఈ వేలం
కాగా ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు, ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్ లను ఈ వేలం వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ వేలం నిర్వహిస్తున్నారు. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైం వెల్, ఫాస్ట్ ట్రాక్ తదితర కంపెనీల వాచీలు ఉన్నాయి.

మొబైల్ ఫోన్లు కూడా వేలంలోనే
అదేవిధంగా వివో, నోకియా, కార్బన్, శాంసంగ్, మోటోరోలా, ఒప్పో తదితర కంపెనీల మొబైల్ ఫోన్లు కూడా ఈరోజు ఈ వేలం నిర్వహిస్తున్నారు. మొత్తం వాచీలు 14 లాట్లు, మొబైల్ ఫోన్లు 24 లాట్లు ఈ వేలంలో ఉంచారు. కొనుగోలు చేయాలనుకునేవారు ఈరోజు పోర్టల్ లో కొనుగోలు చేసుకోవచ్చు.

తిరుమలను ప్రక్షాళన చేసే పనిలో ఈవో
తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో జె శ్యామల రావు చెప్పారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఈవో మార్పు జరిగింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో దోపిడీ కొనసాగిందని ఆరోపణలు ఉన్నాయి. వాటికి చెక్ పెట్టేలా ప్రస్తుత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+