తిరుమలలో ఎమ్మెల్యే కోటా పెంపు - దర్శనం, సేవల్లో ఇక ఇలా..!!

ఎమ్మెల్యేల చిర కాల కోరిక నెరవేరుతోంది. తిరుమలలో తమ సిఫార్సు లేఖల కోటా పెంచాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశాల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీని పైన సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శన, సేవల్లో ఎమ్మెల్యే కోటా పెంపుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బోర్డు సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు.

ఎమ్మెల్యేల కోటాలో
తిరుమలలో శ్రీవారి దర్శనం కు సంబంధించి తమ కోటా పెంచాలని ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. ఇప్పుడు కొత్త బోర్డు ఏర్పాటు తరువాత ప్రభుత్వం ఈ మేరకు సానుకూల నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు చంద్రబాబు కు ఎమ్మెల్యేల అభ్యర్ధన మేరకు ఆమోదం తెలిపారు. ఈ నెల 18న జరిగే టీటీడీ నూతన బోర్డు తొలి పాలక మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల కోటా పరిమితిని పెంచనున్నారు. ఇక పై వారంలో ఆరు రోజులు పాటు, రోజుకి ఆరు చొప్పున సుపథం (రూ.300 టికెట్‌లు) ఇవ్వనున్నారు.

TTD to increase MLA quota Darshan and Seva tickets in Tirumala details here

బోర్డు సమావేశంలో ఆమోదం
తిరుమల దర్శనాలకు సంబంధించి ప్రస్తుతం వారంలో నాలుగు రోజులపాటు ఎమ్మెల్యేల సిఫారసు లేఖల్ని అనుమతిస్తున్నారు. తాజా నిర్ణయం మేరకు ఇకపై వాటిని ఆరు రోజులకు అనుమతించనున్నారు. అదే విధంగా సేవల్లోనూ వారి కోటా ఉండే విధంగా మార్పులకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్యేలు సైతం తమ లేఖల గురించి ఏపీ ప్రభుత్వానికి చేసిన వినతుల పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే విధంగా.. దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శన విధానంలో పాత విధానాలు పునరుద్దరించే అవకాశాలు ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులకు 2008లో దివ్య దర్శనం పేరిట టోకెన్లను ఇచ్చేవారు.

పాత విధానంలోనే
అలిపిరి మార్గంలో రోజుకు 14 వేల టోకెన్లు, శ్రీవారి మెట్టులో 6 వేలు జారీ చేయాలని 2017లో నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్‌ పేరుతో గతంలో వాటిని నిలిపేసింది. ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల టోకెన్లను ఇస్తోంది. అలిపిరిలోనూ వీటిని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటుగా గతంలో తిరుపతిలోని శ్రీనివాసంలో రోజుకు 1,500 చొప్పున స్పెషల్ ప్రవేశ దర్శనం ఎస్‌ఈడీ టికెట్లను జారీ చేసేవారు. ప్రతి ధర్మకర్తల మండలి సభ్యులకు రోజుకు 20 టికెట్లను ఇచ్చేవారు. ప్రస్తుత పాలక వర్గం గతంలోని టికెట్ల ప్రక్రియను పునరుద్ధరిస్తుందని తెలుస్తోంది. తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+