TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ - దర్శనం, గదులకు ఇక నో టెన్షన్..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తుల సేవల్లో కీలక మార్పుల దిశగా టీటీడీ కసరత్తు చేస్తోంది. సాంకేతికతను వినియోగించి దర్శనం.. వసతితో సహా సేవలను మరింత గా సులభతరం చేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ ను వినియోగించి రెండు గంటల సమయంలోనే దర్శనం పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. తాజాగా, భక్తులకు మరింత మెరుగైన, సులభమైన సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తులకు సంబంధించిన సేవలను మరింత సులభ తరం చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటికే తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన టీటీడీ తాజాగా ఏఐ చాట్‌బాట్ సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఈ ఏఐ చాట్‌బాట్ ద్వారా భక్తులు శ్రీవారి దర్శనం, వసతి గదుల లభ్యత, విరాళాలు, ఇతర సేవలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల సౌలభ్యం కోసం ఈ సేవలను ఏకంగా 13 భాషల్లో అందించనున్నారు. అంతేకాకుండా, భక్తులు తమ ఫిర్యాదులను, సలహాలు, సూచనలను కూడా ఈ చాట్‌బాట్ ద్వారా సులభంగా టీటీడీ దృష్టికి తీసుకెళ్లే వెసులుబాటు కల్పించే విధంగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ చాట్‌బాట్‌లో స్పీచ్ టు టెక్ట్స్, టెక్ట్స్ టు స్పీచ్ వంటి ఆధునిక సదుపాయాలు కూడా ఉంటాయని సమాచారం. దీనివల్ల భక్తులు వాయిస్ కమాండ్ల ద్వారా కూడా సమాచారాన్ని పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ అత్యాధునిక చాట్‌బాట్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రముఖ ఐటీ దిగ్గజం అమెజాన్ వెబ్ సర్వీసెస్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, టీటీడీ పాలనలో పారదర్శకత పెంచడంతో పాటు, ఎస్వీబీసీ ఛానల్ ప్రసారాలను మరింత మెరుగుపరిచేందుకు కూడా చర్యలు చేపడుతోంది. ఈ కొత్త టెక్నాలజీ రాకతో భక్తులకు సమాచార సేకరణ మరింత సులభతరం కానుంది. ఇక.. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పది రోజుల పాటు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. అయితే, టికెట్ల విషయంలో మాత్రం అధికారికంగా ప్రకటన చేయనుంది. ఆఫ్ లైన్ లో టికెట్ల జారీ చేయాలా.. ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలా అనే అంశం పైన టీటీడీ నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications