Tirumala: వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు నిమిషాల్లోనే ఖాళీ - భక్తులకు మరో ఛాన్స్ ..!!

తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి ఊహించని డిమాండ్ కనిపిస్తోంది. జనవరి 2వ తేదీ నుంచి పది రోజుల పాటుగా భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందు కోసం ఈ రోజు టీటీడీ వెబ్ సైట్ ద్వారా టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఉదయం టికెట్లను విడుదల చేసింది. పది రోజులకు రూ 300 దర్శనం టికెట్లను భక్తులు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు రెండు వేల చొప్పున అందుబాటులో ఉంచిన రెండు లక్షల ప్రత్యేక దర్శనం టికెట్లు కేవటం 45 నిమిషాల్లో పూర్తయ్యాయి.

అప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో ఆన్ లైన్ ద్వారా ఈ దర్శన టికెట్లు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, టీటీడీ నిర్ణయించిన కోటా పూర్తి కావటంలో అప్పటి వరకు వేచి చూసిన భక్తులను నిరాశ ఎదురైంది. ఇదే సమయంలో ఆన్ లైన్ టికెట్లు దక్కించుకోలేకపోయిన భక్తుల కోసం టీటీడీ మరో నిర్ణయం తీసుకుంది. దర్శనం భక్తులకు జనవరి 1వ తేదిన ఆఫ్ లైన్ విధానంలో టోకెన్లు కేటాయించనున్నారు. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా రోజుకి 50 వేల చొప్పున 5 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి సంక్రాంతి ముగిసే వరకూ వీఐపీ సిఫార్సు లేఖలను అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. జనవరి 1, 2 తేదీల్లో కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకొనేందకు ప్రముఖులతో పాటుగా సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది.

 TTD to Open off line ticket Counters at Tirupati on janurary 1st for Srivari Sarva Darshanam

దీంతో, నేరుగా ప్రోటోకాల్ జాబితాలో ఉన్న వారు వస్తేనే వారికి ప్రత్యేకంగా దర్శన సదుపాయం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. లేఖలను మాత్రం అనుమితించకూడదని డిసైడ్ అయింది. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం టికెట్లు పొందిన వారినే దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. టికెట్లు లేని వారిని తిరుమలకు అనుమతించినా. .దర్శనానికి మాత్రం అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తన్నారు. దీంతో, వచ్చే వారం నుంచి సంక్రాంతి పండుగ ముగిసే వరకూ తిరుమల కొండ పైన భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జనవరి 1వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో సర్వ దర్శనం టికెట్లు తిరుపతిలో పొందాలని టీటీడీ భక్తులకు సూచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+