తిరుమల శ్రీవారి ఆలయంలో అరుదైన ఘట్టం- దర్శనం పై భక్తులకు కీలక సూచనలు..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఈ నెలలో వరుస పర్విదినాల వేళ అరుదైన ఘట్టం చోటు చేసుకోనుంది. అందులో భాగంగా మూడు వరుస ఆస్థానాలు నిర్వహించాలని నిర్ణయించారు. దర్శనాల పైన భక్తులకు కీలక అప్డేట్ ఇచ్చారు. మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని మార్చి 17వ తేదీ మంగళ వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది.

తిరుమలలో ఉగాది వేళ ఆస్తానం నిర్వహించనున్నారు. అందులో భాగంగా ముందుగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని మార్చి 17వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీ. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 16వ తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరని టీటీడీ స్పష్టం చేసింది. అదేవిధంగా మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసారు. ఈ కారణంగా మార్చి 18వ తేది విఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరు.

ttd-to-organise-three-asthanams-in-the-month-of-march-following-the-upcoming-important-festivals

వరుసగా మూడు ఆస్థానాలు

కాగా.. ఉగాది ఆస్థానం (మార్చి 19, 2026): శ్రీ పారాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా, ఉదయం 7 నుండి 9 గంటల మధ్య గర్భాలయంలోని మూలవిరాట్‌, ఉత్సవమూర్తులకు కొత్త వస్త్రాలను సమర్పించి, పంచాంగ శ్రవణం, ఆస్థానం నిర్వహిస్తారు. అదే విధంగా ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి ఆస్థానం శ్రీరామనవమి సందర్భంగా, సాయంత్రం 6:30 నుండి 8 గంటల మధ్య హనుమంత వాహన సేవ, అనంతరం 9 నుండి 10 గంటల మధ్య గరుడాళ్వార్ సన్నిధిలో ప్రత్యేక ఆస్థానం జరుగుతుంది. ఇక.. ప్రత్యేకంగా ఈ నెల 28న పట్టాభిషేక ఆస్థానం శ్రీరామనవమి మరుసటి రోజు సీతారాముల పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీంతో..
ఈ ఆస్థానాల సమయంలో స్వామివారికి వేద పండితులు 'శ్రీరామ జననం' వంటి విశేష ఘట్టాలను పఠిస్తారు. ఇలా వరుసగా మూడు ఆస్థానాలు నిర్వహించటం అరుదైన ఘట్టంగా చెబుతున్నారు. దర్శనం కు వచ్చే భక్తులకు దర్శనం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు సమాచారం.. ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+