Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: నేడు రెండు నెలల వసతి కోటా విడుదల - టీటీడీ అరుదైన రికార్డు..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టీటీడీ ఖరారు చేసిన షెడ్యూల్ కు అనుగుణంగా ఈ రోజు రెండు నెలల గదుల కోటా విడుదలకు టీటీడీ నిర్ణయించింది. తిరుపతి ఎస్వీ గోశాలలో దేశంలో తొలిసారిగా పిండ మార్పిడి (సరోగసి ) పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించటం ద్వారా కొత్త రికార్డు సాధించింది. జూలై నెలకు సంబంధించి తిరుమలలో నిర్వహించే విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడించింది.

నేడు గదుల కోటా విడుదల:శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదుల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన గదుల కోటాను ఈ రోజు(సోమవారం) ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

TTD to release online quota of room allotments for the months of August, September on Monday

తిరుమల, తిరుపతి, తలకోన ప్రాంతాల్లోని గదులను భక్తులు బుక్ చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది. ఇందు కోసం భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్..టీటీడీ యాప్ లో గదులను బుక్ చేసుకోవచ్చని టీటీడీ సూచించింది. దేశంలో తొలిసారిగా పిండ మార్పిడి (సరోగసి ) పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

దేశంలోనే తొలి సారిగా :రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సూచనలతో టీటీడీ, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా దేశావాళీ గోజాతులను అభివృద్ధి చేయాలని గత ఏడాది ఎంఓయు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మేలు రకమైన దేశవాళీ గో జాతిని అభివృద్ధి చేసే క్రమంలో ఎస్వీ గో సంరక్షణ శాల లోని మేలు జాతి ఆవుల నుండి అండం సేకరించి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవిఎఫ్ ల్యాబ్ లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేశారన్నారు . వీటిని టీటీడీ గోశాలలోని ఆవులలో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా విజయం సాధించినట్లు ఈవో తెలిపారు. ఈ ప్రక్రియలో ఒంగోలు ఆవుకు జన్మించిన సాహివాల్ దూడకు పద్మావతి అని నామకరణం చేసినట్లు చెప్పారు.

TTD to release online quota of room allotments for the months of August, September on Monday

జూలై నెలలో ఉత్సవాలు:తిరుమల శ్రీవారి ఆలయంలో ధూప దీప నైవేద్యాలకు, నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే పాలు, పెరుగు, వెన్న, నెయ్యిని దేశవాళీ ఆవుపాల నుండి ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. ఇందుకోసం ఇప్పటికే 200 దేశీయ గోవులను దాతలు సమకూర్చారని, మరో 300 గోవులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. జూలై మాసంలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలను ప్రకటించారు.

జూలై 1న శని త్రయోదశి. జూలై 3న ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ, గురు పూర్ణిమ.. జూలై 13న సర్వ ఏకాదశి... జూలై 15న శని త్రయోదశి..జూలై 17న శ్రీవారి ఆణివార ఆస్థానం.. జూలై 22న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు... జూలై 30న నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం నిర్వహించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+