TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గోల్డెన్ ఛాన్స్ - ఇక స్వయంగా..!!
Tirumala: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం ఎనిమిది గంటల సమయం పడుతోంది. వేసవి ప్రారంభం కావటంతో భక్తుల కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి ద్వితీయార్ధం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో టీటీడీ భక్తులకు స్వయంగా అన్న ప్రసాద వితరణ చేసే ఛాన్స్ కల్పిస్తూ ప్రకటన చేసింది.
స్థానికులకు దర్శనం
టీటీడీ ప్రతీ నెలా తొలి మంగళవారం తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీటీడీ బోర్డు ఈ నిర్ణయం అమలు చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 4వ తేదీ మంగళవారం దర్శనం కోసం ఈ నెల 2వ తేదీన టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లతో పాటుగా .. తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపది కన ఉదయం 5 గంటల నుండి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.

భక్తులకు అరుదైన అవకాశం
ఈ మేరకు తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని టీటీడీ సూచించింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించింది. ప్రస్తుతం అన్నప్రసాద వితరణ కోసం ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. (కాగా ఇందులో ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు) దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు.
అన్న ప్రసాదం
టీటీడీ నిత్యం 2.5 లక్షల మందికి అన్న ప్రసాదం అందిస్తోంది. ప్రస్తుతం కొండపై మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని రెండు కంపార్ట్ మెంట్లు, బయటి క్యూలైన్లు, పీఏసీ-4 (పాత అన్నప్రసాదం), పీఏసీ-2లో అన్నదానం జరుగు తుంది. అదే విధంగా కొండ కింద తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, రుయా ఆసుపత్రి, స్విమ్స్, తిరుచానూరులో భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications