Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. సోమవారం దర్శన టికెట్లు విడుదల..

అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను సోమవారం టీటీడీ విడుదల చేయనుంది. రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్ సైట్ లో అక్టోబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే అంగప్రదక్షణ టోకెన్ లతో పాటు శ్రీవాణి ట్రస్ట్ టోకెన్లు
కూడా విడుదల చేయనున్నారు. వికలాంగులు, వయోవద్ధుల దర్శన టికెట్లు కూడా సోమవారమే విడుదల చేయనున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకి 15 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.

మంగళవారం నాడు రూ.300 ప్రత్యే ప్రవేశ దర్శన టికెట్లు కూడా టీటీడీ వెబ్ సైట్ లో అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు ఆగస్ట్, సెప్టెంబర్ నెలకు సంబంధించి రోజుకు 4 వేల చొప్పున అదనపు కోటా టికెట్లను జులై 25న టీటీడీ విడుదల చేయనుంది. గదులకు సంబంధించి కూడా వివరాలు వెల్లండించనున్నారు. తిరుమల, తిరుపతి, తలకోనలో ఆక్టోబర్ నెలకు సంబంధించి గదుల సమాచారాన్ని జులై 26న ఉదయం 10 గంటలకు వెబ్ సైట్ అందుబాటులో ఉంచుతారు.

ttd8

భక్తులు ఈ సమాచారాన్ని గమనించి సహకరించగలరని టీటీడీ కోరింది. టికెట్లు కావాలనుకునేవారు https://tirupatibalaji.ap.gov.in టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. తిరుమల శ్రీవారికి అలంకరించే బంగారు ఆభరణాల వివరాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. శ్రీనివాసుడికి 1.2 టన్నుల బంగారు ఆభరణాలు, 10 టన్నుల వెండి ఆభరణాల ఉన్నట్లు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఏడాదికి శ్రీవారికి 500 టన్నుల పుష్పాలతో అలంకరణ చేస్తున్నట్లు ప్రకటించారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో 24500 మంది ఉద్యోగులు ఉండగా, రోజుకు 800 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని వివరించారు. శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి ఏటా 500 టన్నుల నెయ్యి వినియోగిస్తున్నట్లు చెప్పారు. స్వామి పేరుతో రూ 17వేల కోట్ల నగదు, 11 టన్నుల బంగారం బ్యాంకులో డిపాజిట్ చేశామని ప్రకటించారు. కాగా ఆదివారం తిరుమలలో భక్తు రద్దీ కొనసాగింది. భక్తులతో తిరుమలలోని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.

స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. శనివారం శ్రీవారిని 84,430 మంది భక్తులు దర్శించుకోగా 38,662 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చిందని టీటీడీ ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+