TTD: తిరుమలలో భారీ వర్షాలు, రూ. 4 కోట్లు నష్టం, 30 ఏళ్లలో ఇలాంటి వానలు చూడలేదు, టీటీడీ చైర్మన్ !

తిరుమల/తిరుపతి: నవంబరు 17 నుంచి 19 వ తేదీ వరకు తిరుమల, తిరుపతి లో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పొర్లి కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంపునకు గురి చేశాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భారీ వర్షాల వల్ల తిరుమల లో రూ 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణ గోడ దెబ్బతిని, ఘాట్ రోడ్ లో నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీ సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి వీటిని తొలగింప చేసి తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్ ను పునరుద్ధరించారని టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి చెప్పారు.

 రెండవ ఘాట్ రోడ్డులో 13 చోట్ల !

రెండవ ఘాట్ రోడ్డులో 13 చోట్ల !

రెండవ ఘాట్ రోడ్లో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయని టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి తెలిపారు. ఐదు ప్రాంతాల్లో రక్షణ గోడలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. టీటీడీ అధికారులు, సిబ్బంది ఈ ఘాట్ రోడ్డులో కూడా కొండ చరియలను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారని టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి చెప్పారు.

 నారాయణగిరి గెస్ట్ హౌస్ దగ్గర !

నారాయణగిరి గెస్ట్ హౌస్ దగ్గర !

తిరుమల నారాయణగిరి గెస్ట్ హౌస్ ను ఆనుకొని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయని టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి అన్నారు. అధికారులు నారాయణ గిరి, ఎస్వీ అతిథి గృహాల్లోని యాత్రికులను ముందు జాగ్రత్త గా ఇతర ప్రాంతాలకు తరలించారని టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి వివరించారు. శ్రీవారి మెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, కొంతమేరకు ఫుట్ పాత్ భారీ వర్షాలకు దెబ్బతిన్నాయని టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి అన్నారు.

 కపిలతీర్థంలో మండపం

కపిలతీర్థంలో మండపం

తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక వైపు ఉన్న గోడ తో పాటు, రాంనగర్, వినాయక నగర్, జి ఎంబి క్వార్టర్స్, శ్రీనివాసం విశ్రాంతి గృహం కాంపౌండ్ వాల్స్ దెబ్బ తిన్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి తెలిపారు. కపిలతీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతిందని, దీని మరమ్మతులకు 70 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేశారన్నారు.

 సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం

సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం

వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగిందన్నారు. ఐటి విభాగం అధికారులు, సిబ్బంది వెంటనే పునరుద్ధరించి భక్తుల సేవలకు ఇబ్బంది లేకుండా చేశారని టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి చెప్పారు. స్వామివారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశామని టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి అన్నారు.

 భారీ వర్షాలు తగ్గిన తరువాత అందరికి స్వామి దర్శనం

భారీ వర్షాలు తగ్గిన తరువాత అందరికి స్వామి దర్శనం

టికెట్లు ఉండి దర్శనానికి రాలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల ,తిరుపతిలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+