Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీటీడీలో మరో భారీ స్కాం..! పదేళ్లలో 54 కోట్లు కొట్టేశారు..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలిస్టర్ శాలువాలు రూ. 54 కోట్ల నష్టానికి కారణమయ్యాయని అంతర్గత విచారణలో తేలింది, ఇది ఏసీబీ విచారణ మరియు టెండర్ సంస్కరణలకు దారితీసింది.

ఏపీలో అత్యంత పవిత్రమైన శ్రీవారి ఆలయ వ్యవహారాలు చూస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కల్తీ నెయ్యి, పరకామణి వివాదాలు చల్లారకముందే మరో కుంభకోణం చోటు చేసుకుంది. ఈసారి పట్టువస్త్రాల(శాలువాల) కొనుగోళ్లలో ఈ స్కాం జరిగింది. సిల్స్ శాలువాలకు బదులుగా పాలిస్టల్ శాలువాలు సరఫరా చేసి అక్రమార్కులు ఏకంగా రూ.54 కోట్లు కొట్టేసినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి టీటీడీ వ్యవహారశైలి చర్చనీయాంశమవుతోంది.

2015 నుండి 2025 వరకు పదేళ్ల పాటు ఇలా సిల్క్ శాలువాల స్ధానంలో పాలిస్టర్ శాలువాల సరఫరా మోసం జరిగిందని, స్వచ్ఛమైన మల్బరీ పట్టుకు బదులు పాలిస్టర్ శాలువలు సరఫరాలు చేసినట్లు టీటీడీ అంతర్గత నిఘా విచారణలో తేలింది. టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు దీనిపై ఆందోళన వ్యక్తం చేయడంతో విజిలెన్స్ విచారణ మొదలైంది. కాంట్రాక్టర్‌ టెండర్లలో పేర్కొన్న మల్బరీ పట్టు స్థానంలో చౌకైన పాలిస్టర్ వస్త్రాన్ని సరఫరా చేసినట్లు ఈ విచారణలో నిర్ధారించారు.

TTD s Latest Shock 54 Crore Scam Sells Polyester as Silk Months After Ghee Row

ఈ అక్రమాల కారణంగా టీటీడీ బోర్డుకు రూ.54 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ శాలువలను ప్రముఖ దాతలకు బహుమతులుగా వేదాశీర్వచనం వంటి ఆలయ కార్యక్రమాలలో ఇస్తున్నారు. సుమారు రూ.350 విలువైన శాలువాను రూ.1,300కు బిల్ చేశారని, ఇలా మొత్తం అక్రమాల విలువ రూ.50 కోట్లకు పైన ఉంటుందని అంచనా. దీనిపై ఏసీబీ విచారణ కోరినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

టీటీడీ అధికారులు శాలువాల శాస్త్రీయ విశ్లేషణ కోసం వీటి నమూనాలను కేంద్రీయ పట్టు పరిశోధన మండలి (సీఎస్‌బీ)తో పాటు మరో ప్రయోగశాలకు పంపగా..అవి పాలిస్టర్ వస్త్రంగా తేలింది. ఇది టెండర్ నిబంధనల స్పష్టమైన ఉల్లంఘనే. అసలైన పట్టు ఉత్పత్తులకు ఉండాల్సిన సిల్క్ హోలోగ్రామ్ కూడా సరఫరా చేసిన నమూనాలలో లేదు. దీంతో ఇలా శాలువా వస్త్రం మార్చి సరఫరా చేసిన సంస్థపై విచారణ జరగబోతోంది.

TTD s Latest Shock 54 Crore Scam Sells Polyester as Silk Months After Ghee Row

విజిలెన్స్ నివేదికపై తక్షణమే స్పందించిన టీటీడీ ట్రస్ట్ బోర్డు.. సంబంధిత సంస్థతో ఉన్న అన్ని ప్రస్తుత టెండర్లను రద్దు చేసింది. పూర్తి స్థాయి నేర పరిశోధన నిమిత్తం ఈ కేసును ఏసీబీకి అప్పగించారని తెలుస్తోంది. ఇప్పటికే లడ్డూ కల్తీ వ్యవహారంతో టీటీడీ ప్రతిష్ఠ మసకబారింది. ఆ తర్వాత పరకామణి చోరీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణ జరుపుతుంటగానే ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారి శవమై తేలారు. దీంతో తిరుమలలో ఏం జరుగుతుందన్న చర్చ సామాన్య భక్తుల్లో మొదలైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+