మరోసారి దయతలిచేనా: పవన్ కళ్యాణ్ చుట్టూ ప్రదక్షిణలు?
చిత్తూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్ చక్కెర్లు కొడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత ఏడాది పవన్ వల్లే హరిప్రసాద్‌కు టిటిడిలో సభ్యుడిగా అవకాశం దక్కిందనే వాదనలు ఉన్నాయి.
ఈ నెల 27వ తేదీతో హరిప్రసాద్ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి తన పదవి పొడిగింపు కోసం పవన్ కళ్యాణ్ చుట్టూ చక్కెర్లు కొడుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, పవన్ కళ్యాణ్ ఆయనను ఏ మేరకు కరుణిస్తారు? ఈసారి ప్రభుత్వం పవన్ చెప్పే మాటను పట్టించుకుంటుందా? అనేది చూడాల్సి ఉంది.
చక్రం తిప్పారా?: పవన్‌కళ్యాణ్, బీజేపీ చెప్పిన వారికి బాబు ఓకే!టిడిపి అధికారంలోకి వచ్చాక దాదాపు ఏడాది తర్వాత చదలవాడ కృష్ణమూర్తిని టిటిడి చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయనతో పాటు 14 మందికి బోర్డు సభ్యులగా అవకాశం కల్పించింది. అందులో పసుపులేటి హరిప్రసాద్, భానుప్రకాద్ రెడ్డి తదితరులు ఉన్నారు.

వీరిద్దరి మధ్య గత ఏడాది పోటీ నడిచింది. భాను ప్రకాశ్ రెడ్డి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు శిష్యుడిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్.. హరిప్రసాద్ కోసం ప్రయత్నించినట్లుగా వార్తలు వచ్చాయి. తొలుత హరిప్రసాద్‌కు, ఆ తర్వాత భానుప్రకాశ్ రెడ్డికి.. ఇద్దరికీ టిటిడి సభ్యులుగా అవకాశం వచ్చింది.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు పసుపులేటి హరిప్రసాద్ ఆ పార్టీలో పని చేశారు. దీంతో పవన్ కళ్యాణ్‌తో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన టిడిపిలో ఉన్నప్పటికీ.. పవన్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
సర్వే చెప్పిన నిజం: వారిద్దరు ఫెయిల్, పవన్ కల్యాణ్‌కు స్పేస్?ఇప్పుడు తన పదవి ముగిస్తున్నందున మరోసారి ఆ పదవిని దక్కించుకునేందుకు పవన్ కళ్యాణ్ ద్వారా ప్రయత్నాలు చేసేందుకు.. ఆయన చుట్టు తిరుగుతున్నారని అంటున్నారు. మరోవైపు భానుప్రకాశ్ రెడ్డి కూడా బిజెపి నేతల ద్వారా పదవిలో కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications