• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ కావద్దు ..ఏపీని ఎడారిలా చెయ్యొద్దు అంటున్న కాంగ్రెస్ నేత తులసీరెడ్డి

|

ఇప్పుడు ఏపీలో కేసీఆర్, జగన్ ల స్నేహం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . . నదీ జలాల ఒప్పందాల విషయంలో , వివాదాల్ని పరిష్కరించే విషయంలో జగన్ కేసీఆర్ చేతిలో కీలు బొమ్మగా మారుతున్నారని ప్రత్యర్ధి పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఇక తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేసీఆర్ కు పెత్తనం ఇస్తే రాష్ట్రం ఎడారిగా మారుతుందని ఆయన జగన్ ను హెచ్చ్చారించారు . జగన్ కేసీఆర్ ను నమ్మటం మంచిది కాదని తులసీరెడ్డి హితవు పలికారు.

ఏపీ ప్రజల సొమ్ముతో తెలంగాణాకు లబ్ది చేస్తారా జగన్... అని ప్రశ్నిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే

  బీజేపీ పాలనలో నేరగాళ్లు రాజ్యమేలుతున్నారు - తులసి రెడ్డి
   గోదావరీ మిగులు జలాలు ఏపీ సొత్తు అన్న తులసీ రెడ్డి

  గోదావరీ మిగులు జలాలు ఏపీ సొత్తు అన్న తులసీ రెడ్డి

  విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో మీడియాతో మాట్లాడిన తులసిరెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ ఏపీని తెలంగాణకు తాకట్టు పెడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ కావాలంటే తన ఆస్తులు కేసీఆర్ కు ధారాదత్తం చెయ్యొచ్చని కానీ ప్రజా సొమ్మును ఇవ్వటం మాత్రం దారుణం అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ మాయలో పడొద్దని గతంలోనూ హెచ్చరించారు తులసీరెడ్డి . గోదావరి మిగులు జలాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదనలకు జగన్ అంగీకరించడం చారిత్రక తప్పిదమేనని విమర్శించారు. గోదావరి మిగులు జలాలు ఏపీ సొత్తు అని స్పష్టం చేశారు. సీఎం జగన్ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్ ను కేసీఆర్ చేతుల్లో పెడుతున్నారని మండిపడ్డారు.

  రాయలసీమకు నీళ్లు అందివ్వాలన్న పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేస్తుంది పచ్చి మోసం అన్న తులసీ రెడ్డి

  రాయలసీమకు నీళ్లు అందివ్వాలన్న పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేస్తుంది పచ్చి మోసం అన్న తులసీ రెడ్డి

  ఏపీ సీఎం జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి మిగులు జలాలపై చేసిన ప్రతిపాదనకు ఏపీ సీఎం జగన్ అంగీకారం తెలపడం సబబు కాదని అన్నారు. కేసీఆర్ చెప్పినట్టు ఆడుతూ జగన్ రాష్ట్రాన్ని ఎడారిలా మారుస్తున్నారని మండిపడ్డారు. ఏపీ విషయంలో కేసీఆర్ జోక్యం సహించరానిదని తులసి రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమకు నీళ్లు అందివ్వాలన్న పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పచ్చి మోసం చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి మిగులు జలాలను తెలంగాణ ప్రభుత్వంతో పంచుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని తులసిరెడ్డి స్పష్టం చేశారు.

  కేసీఆర్ తో జగన్ స్నేహంపై ప్రతిపక్ష పార్టీల మండిపాటు .. జగన్ కు వార్నింగ్

  కేసీఆర్ తో జగన్ స్నేహంపై ప్రతిపక్ష పార్టీల మండిపాటు .. జగన్ కు వార్నింగ్

  ఇప్పటికే ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా జగన్, కేసీఆర్ ల స్నేహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం జగన్ , కేసీఆర్ ఏం చెప్తే దానికి ఓకే అనటం ఏపీలోని ప్రతిపక్ష పార్టీలకు ఏ మాత్రం నచ్చటం లేదు. అందుకు కారణం మొదట నుండీ కేసీఆర్ ఏపీ పట్ల వివక్షతోనే మాట్లాడారు. ఏపీ అభివృద్ధి విషయంలో , గతంలో విభజన సమయంలో ఏపీకి రావాల్సినవి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. ఇక నీటి పంపిణీ విషయంలో, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కూడా కయ్యానికి కాలు దువ్వారు కేసీఆర్ . అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఏపీ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తారంటే ఏపీలోని రాజకీయ వర్గాలు కానీ ప్రజలు కానీ నమ్మేలా లేరు . అందుకే ఒకటికి పది సార్లు కేసీఆర్ తో జాగ్రత్త అని జగన్ ని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ కావొద్దని సలహా ఇస్తున్నారు.

  English summary
  Speaking to the media at Vijayawada Andhraratna Bhavan, Thulasireddy said that the Jagan AP cm is tying up Telangana cm for their selfish purposes. He claimed that his assets could be downgraded to KCR but not the public money . Andhra Pradesh Chief Minister YS Jagan had earlier warned to not to fall into the Telangana CM KCR trap.Telangana CM KCR proposals on the surplus water of Godavari criticized the acceptance of Jagan is a historical mistake. Godavari has made it clear that surplus water is ap's right .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X