కారెక్కిన తుమ్మల, కేసీఆర్‌పై పొగడ్త, పొరపాటుగా జై..

కేసీఆర్‌ను తుమ్మల పొగడ్తలతో ముంచెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నో మార్పులకు కేసీఆర్, తానే మూలమన్నారు. కేసీఆర్ నేతృత్వంలోనే బంగారు తెలంగాణ సాకారమవుతుందన్నారు. కేసీఆర్ స్వాగతాన్ని మన్నించి తెరాసలో చేరుతున్నానని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి కావాలనే పార్టీలో చేరుతున్నానని చెప్పారు.
పోలవరం ముంపు మండలాలను ఆంధ్రాలో కలపడం అన్యాయమన్నారు. కేసీఆర్ నేతృత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. కేసీఆర్ తనకు చిరకాల మిత్రుడు అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పలు మార్పులకు తాను, కేసీఆర్ కారణమన్నారు. తెలంగాణను కోటి రతనాల వీణగా మార్చాలన్నారు. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు తనను ఎంతగానే బాధించాయన్నారు.
కాగా, తుమ్మలతో పాటు ఆయన అనుచరులకు గులాబీ కండువాలు కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మల ప్రసంగించారు. ప్రసంగాన్ని ముగిస్తూ ఆయన జైహింద్, జై జన్మభూమి అంటూ ముగించారు. తెలుగుదేశం పార్టీలో ఉండి, అలవాటులో పొరపాటుగా ఆయన జై జన్మభూమి అని, ఆ తర్వాత నాలుక్కరుచుకున్నారు.












Click it and Unblock the Notifications