కాటమరాయుడి వేడుకల్లో పవన్ రాజకీయాలపై రవి ప్రకాష్: గణేష్ క్షమాపణ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా ప్రీ రిలీజింగ్ వేడుకల్లో తెలుగు న్యూస్ చానెల్ టీవీ9 సిఈవో రవిప్రకాష్ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా ఈ వేడుకల్లో ఆయన ప్రసంగమంతా రాజకీయపరంగానే సాగడం విశేషం. కాటమరాయుడు ప్రీ రిలీజింగ్ వేడుకలు శనివారం హైదరాబాదులో జరిగిన విషయం తెలిసిందే.

పవన్ కల్యాణ్‌ను రవి ప్రకాష్ ప్రశంసలతో ముంచెత్తారు.ఇటీవల కాలంలో తాను ఎక్కువగా అభిమానించే వ్యక్తుల్లో పవన్ కల్యాన్ ఒకరని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో పవన్ పోషించిన పాత్ర చాలా కీలకమైందని అన్నారు. పవన్ కల్యాణ్ పోషించిన పాత్ర వల్ల ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు.

Pawan Kalyan

పవన్ కల్యాణ్ పోషించిన పాత్ర చాలా గొప్పదని, పవన్ కల్యాణ్ స్థానంలో మరొకరు ఉంటే డబ్బు, హోదా, ఆస్తులు సంపాదించుకుంటారని రవిప్రకాష్ అన్నారు. కానీ అలాంటి పనులకు పవన్ కల్యాణ్ దూరంగా ఉన్నారని, నిస్వార్ధంతో ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్నారని అన్నారు.

పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని ఆయన విమర్శించారు. నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను రోడ్డు మీద పడేశారని అన్నారు. అలాంటి వాటిని ధైర్యంగా ఎదురించారని, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారని రవిప్రకాష్ అన్నారు.

కాగా, ఆ తర్వాత మాట్లాడిన బండ్ల గణేష్ రవిప్రకాష్‌కు ఇంత కాలం తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పారు. ఇంత కాలం రవి ప్రకాష్ తనకు నచ్చలేదని, కానీ ఈ రోజు మాట్లాడిన మాటలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన చెప్పారు. రవిప్రకాష్‌ అణువణువునా తన దేవుడు పవన్ కల్యాణ్‌లో ఉన్న నిజాయితీ కనిపించిందని ఆయన అన్నారు. ఇంత కాలం తాను రవిప్రకాష్‌ను విస్మరించినందుకు సభా ముఖంగా క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు.

రవిప్రకాష్ జనాల్ని ఇబ్బంది పెడతాడనుకుంటే పవన్ కల్యాణ్ గురించి మట్లాడారని, ఆ సమయంలో తన బ్లడ్ బాయిల్ అయిందని బండ్ల గణేష్ అన్నారు. రక్తం తన్నుకొచ్చిందని, తన బీపీ చెక్ చేస్తే 180 ఉంటుందని బండ్లగణేష్ అన్నారు. తనకు అంతకు ముందు రవి ప్రకాష్ అంటే ఇష్టం లేదని, కాని పవన్ కల్యాణ్ గురించి నిజాయితీగా మాట్లాడారని కొనియాడారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu news channel TV9 CEO Ravi Prakash made political speech in Pawan Kalyan's Katama rayudu film pre releasing function.
Please Wait while comments are loading...