జగన్ సమావేశానికి 20 మంది ఎమ్మెల్యేలు డుమ్మా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి హైదరాబాదులోని లోటస్‌పాండ్‌లో గల తన నివాసంలో ఆదివారం పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది.
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా నిపుణుల కమిటీ సూచనల మేరకు అందరికీ అందుబాటులో ఉండేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.

ఆదివారం ఉదయం 10 గంటలకు జరగాల్సిన వైసీపీఎల్పీ సమావేశం 20 మంది పార్టీ శానససభ్యులు హాజరు కాకపోవడంతో పార్టీ అధ్యక్షుడు జగన్ వారి కోసం ఎదురుచూసి రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించారు. ఆలస్యంగా కూడా వారు రాలేదు.
ప్రయాణ సౌకర్యం లేనందున, వ్యక్తిగత పనుల కారణంగా రాలేకపోతున్నట్లు కొంత మంది తెలియజేసినట్లు సమాచారం. అయితే, కొంత మంది మాత్రం ఏ విధమైన సమాచారం ఇవ్వలేదని అంటున్నారు. దీంతో జగన్ తీవ్రంగా మండిపడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications