అనురాధ దంపతుల హత్య: కటారి మోహన్‌పై చంద్రబాబుకు చింటూ ఫిర్యాదు?
చిత్తూరు: చిత్తూరు మేయర్ అనురాధ దంపతులకు, వారి మేనల్లుడు చింటూకు మధ్య తలెత్తిన విభేదాల గురించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ముందే తెలుసునని అంటున్నారు. ఈ మేరకు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి.
చింటూ, కటారి మోహన్ మధ్య గొడవ తన దృష్టికి వచ్చి ఉంటే సమస్యను పరిష్కరించి ఇంతదూరం రాకుండా చూసేవాడినని కటారి దంపతుల హత్యానంతరం చంద్రబాబు మీడియాతో అన్నారు. అయితే, ఈ విభేదాల గురించి కటారి మోహన్‌తో పాటు చింటూ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు ముందే చెప్పారంటూ ప్రచారం సాగుతోంది.

మోహన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని చింటూ చంద్రబాబుకే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశాడని చెబుతున్నారు. అయితే, చింటూ చీటికిమాటికి చిల్లర గొడవలకు దిగుతూ పార్టీకి కూడా ఇబ్బందులు సృష్టిస్తున్నాడని కటారి మోహన్ వారికి చెప్పాడని అంటున్నారు. అయితే, పరిస్థితి ఇంత దూరం వస్తుందని చంద్రబాబు గానీ లోకేష్ గానీ ఊహించకపోవచ్చు.
ఇదిలావుంటే, మేయర్ అనురాధ దంపతుల హత్య కేసు దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ పెద్దనాన్న గురప్పను పోలీసులు మంగళవారంనాడు విచారించారు. మోహన్ పెద్దక్క యశోదమ్మ భర్తే గురప్ప. 2005లో జరిగిన ఎన్నికల్లో యశోదమ్మ తన తమ్ముడు కటారి మోహన్‌పై పోటీ చేసి ఓడిపోయింది.
అప్పటి నుంచి కటారి, గుర్రప్ప కుటుంబాల మధ్య విభేదాలు పొడసూపినట్లు భావిస్తున్నారు. ఇదే సమయంలో చింటూకు, గురప్ప కుటుంబ సభ్యులకు మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. చింటూకు గురప్ప ఓ వ్యక్తి వద్ద పెద్ద మొత్తంలో అప్పు ఇప్పించినట్లు చెబుతున్నారు. అయితే, ఆ మొత్తం దేని కోసం చింటూ ఉపయోగించాడనేది తనకు తెలియదని గురప్ప పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications