గౌతమి కేసులో సోదరి పావని సంచలన ఆరోపణలు, రాజకీయ ఒత్తిళ్లు లేవని..

పాలకొల్లు మండలం దిగమర్రులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గౌతమి కేసులో మరో షాకింగ్ విషయాన్ని ఆమె సోదరి పావని వెల్లడించారు.

ఏలూరు: పాలకొల్లు మండలం దిగమర్రులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గౌతమి కేసులో మరో షాకింగ్ విషయాన్ని ఆమె సోదరి పావని వెల్లడించారు. ఆమె ఎమ్మెల్యేల పైన ఆరోపణలు చేశారు.

గౌతమి అనుమానాస్పద కేసులో నిందితులను కాపాడేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని పావని సంచలన ఆరోపణలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ప్రధాన నిందితుడి ఇంటి ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

 Twist in Gautami accident, Sister says 'Murder'

ఆసుపత్రిలో నాలుగు రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌతమి సోదరి పావని ఇంటికి చేరింది. పాలకొల్లు రోడ్డు దిగమర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సోదరి గౌతమి మృతి చెందగా, పావని ఆసుపత్రిలో చేరారు.

శరీరంపై గాయాలతో పాటు కాలర్‌బోన్ విరగడంతో అప్పటి నుంచి ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యుల సూచనల మేరకు ఇంటి వద్దే చికిత్స అందిస్తున్నారు. రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది.

కాగా, గౌతమి మృతి ఉదంతాన్ని ఇంకా హత్య కేసుగా భావించలేదని, పూర్తి ఆధారాలు లభించాకే హత్య కేసుగా మార్పు చేస్తామని పోలీసులు మంగళవారం చెప్పారు. సాంకేతిక ఆధారాలు లభించాల్సి ఉందన్నారు.

సెల్‌ఫోను కాల్‌డేటా సీసీ కెమేరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామన్నారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. నిందితులు ఎవరైనా వదిలే ప్రసక్తేలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+