కాల్ మనీ సెక్స్ రాకెట్‌లో కొత్త కోణం: అమరావతిలో భూముల కొనుగోళ్లు
విజయవాడ: విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ సెక్స్ రాకెట్ కుంభకోణంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో కాల్ మనీ సెక్స్ రాకెట్ ముఠా పెద్ద యెత్తున భూములు కొనుగోలు చేసినట్లు బయటపడింది.
కాల్ మనీ సెక్స్ రాకెట్ ముఠా ఆర్థిక మూలాలపై టాస్క్‌ఫోర్స్ ఆరా తీస్తోంది. కొందరు రాజకీయ నాయకులతో పాటు ఎన్నారైల పెట్టుబడులు కూడా ఉన్నట్లు సమాచారం రావడంతో ఆ దిశగా విచారణ కొనసాగుతోంది. కొందరు ఎన్నారైలతో పాటు ఆర్థికంగా బలపడినవారు కాల్ మనీ సెక్స్ రాకెట్ ముఠా తరఫున పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు.

కాల్ మనీ సెక్స్ రాకెట్ కుంభకోణం కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు చెన్నుపాటి శ్రీనివాస రావు, వెనిగళ్ల శ్రీకాంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు వారి సన్నిహితుల ద్వారా, బంధువుల ద్వారా నిందితులపై పోలీసులు ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ స్థితిలో నిందితులు లొంగుబాటుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న పెండ్యాల శ్రీకాంత్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications