• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

"మంది సొమ్ము మెక్కిన వారు కూడా మాట్లడటమేనా": వైసీపీ ఎంపీకి నాగబాబు కౌంటర్

|

అమరావతి: ఏపీలో రాజధాని అంశంపై రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఓ వైపు చంద్రబాబు నాయుడు రాజధాని రైతులకు అండగా ఉంటానని హామీ ఇస్తుండగా మరోవైపు జనసేనాని కూడా ఆ ప్రాంతంలో పర్యటించి రైతులకు మద్దతు తెలిపాడు. ఇక జనసేన నేత నాగబాబు కూడా జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు.

జగన్ తప్పులను సరిదిద్దుకోవాలి

ఏపీ సీఎం జగన్ తన పద్ధతి మార్చుకోవాలని జనసేన నేత నాగబాబు అన్నారు. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను వెంటనే సరిద్దిదు కోవాలని హితవు పలికారు. తప్పులను సరిదిద్దుకుని రానున్న నాలుగున్నర ఏళ్లలో మంచి పరిపాలన అందించాల్సిందిగా నాగబాబు కోరారు. ప్రజలు వైసీపీని నమ్మి 151 సీట్లు ఇచ్చారని చెప్పిన నాగబాబు వారి నమ్మకాన్ని వమ్ము చేయరాదని సూచించారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి పాలన సాగించడం సరికాదని నాగాబాబు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు.

సలహాగా స్వీకరిస్తారో, సవాల్‌గా తీసుకుంటారో మీ ఇష్టం

సీఎం హోదాలో ఉండి తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టే అవకాశం లేదా విధానాలపై విమర్శించే ఛాన్స్ తమకు ఇవ్వొదని నాగబాబు ట్వీట్ చేశారు. అంతేకాదు తాము చెబుతున్నది ఒక మంచి సలహాగా స్వీకరిస్తారో, లేదా ఒక సవాల్‌గా స్వీకరిస్తారో అది మీకే వదిలేస్తున్నామంటూ మరో ట్వీట్ చేశారు నాగబాబు. ఏపీ ప్రజలందరినీ ప్రేమించండంటూ నాగబాబు చెప్పారు. ప్రజలకు మంచి పాలన అందించండంటూ ట్వీట్ చేశారు. రెండు కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఏపీ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయన్న లక్షణాలు కనిపిస్తున్నాయని అది దగ్గరలోనే ఉందని మరో ట్వీట్‌లో తన అభిప్రాయాన్ని నాగబాబు చెప్పారు.

పవన్‌ను ఉద్దేశిస్తూ విజయ్ సాయి రెడ్డి ట్వీట్

ఇక విజయ్ సాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై కూడా నాగబాబు చాలా ఘాటుగా స్పందించారు. గుండుసున్నా దేనితో కలిసినా విడిపోయినా ఫలితం సున్నానే అని విజయ్ సాయిరెడ్డి జనసేనను ఉద్దేశిస్తూ పరోక్ష ట్వీట్ చేశారు. సున్నాను తలపైన ఎత్తుకున్నా, చంకలో పెట్టుకున్నా జరిగేది అదేనంటూ ట్వీట్ చేశారు విజయ్ సాయిరెడ్డి. ఇది పలుమార్లు నిరూపితమైనప్పటికీ కొందరు ఇంకా ప్రయోగాలకు సాహసిస్తూనే ఉంటారని, ఆ ప్రయత్నంలో దెబ్బతింటూ ఉంటారని విజయ్ సాయిరెడ్డి జనసేన బీజేపీ కలయికను ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్ చేశారు. అంతేకాదు యాక్టర్ నిమిత్త మాత్రుడని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ విజయ్ సాయి రెడ్డి ట్వీట్ చేశారు. కమ్యూనిస్టులతో కలిసినా, బీఎస్పీ కాళ్లు పట్టుకున్నా కమలం వైపు కదిలినా ఆదేశించేది మాత్రం 40 ఇయర్స్ ఇండస్ట్రీనే అంటూ చంద్రబాబును పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశిస్తూ విజయ్ సాయి ట్వీట్ చేశారు.

మంది సొమ్ము మెక్కిన వారు కూడా మాట్లడమేనా

దీనిపై నాగబాబు తీవ్రంగా స్పందించారు. మంది సొమ్ము మెక్కిన ఎటా కానీ వారు కూడా నీతులు మాట్లాడటమే అంటూ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు నాగబాబు. జీరో విలువలు తెలియని వారికి ఏం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే అని ట్వీట్‌లో పేర్కొన్నారు నాగబాబు. ఈ రోజు సైన్స్, కంప్యూటర్, మ్యాథ్స్ ఇంత డెవలప్ అయ్యాయంటే అందుకు కారణం సున్నా మహత్యమే అంటూ ఈ విషయం చదువుకున్న జ్ఞానం లేని వారు తెలుసుకోవాలన్నారు.

మంత్రులు ఎక్స్‌ట్రా జబర్దస్త్ లేని లోటు పూడ్చారు

మరోవైపు తాను ఇంతకాలంగా జబర్దస్ జడ్జీగా వ్యవహరించిన నాగబాబు ఇటీవలే అదిరింది అనే ప్రోగ్రామ్‌కు షిఫ్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే అదిరింది ద్వారా జబర్దస్త్ లోటు తీరిందని చెప్పిన ఆయన... అంబటి, పేర్ని నాని, అనిల్, అవంతి లాంటి లీడర్లతో ఎక్స్‌ట్రా జబర్దస్త్ లోటు కూడా తీరిందని సెటైర్లు వేశారు. ఇక అదిరింది కామెడీ షో పార్ట్ 2 అవసరం లేదేమో అనిపిస్తుందని అన్నారు. అంబటి రాంబాబు తోకలేని పిట్ట అని నిజంగానే మంచి నటుడు అంటూ గతంలో అంబటి నటించిన ఓ సినిమా క్లిప్పింగ్‌ను ట్వీట్ చేశారు నాగబాబు.

English summary
War of words between YCP leaders and Jansena leader Nagababu reached to new heights as the later criticized CM Jagan and his policies. Nagababu brother of Pawan Kalyan also took a jibe at Vijaysai Reddy, a YCP MP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X