బాలికపై గ్యాంగ్ రేప్, వ్యభిచార గృహాహనికి విక్రయం కేసు: ఇద్దరి అరెస్టు
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను వ్యభిచార గృహానికి విక్రయించిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలు బేగం, రౌడీ షీటర్ హయగ్రీవన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
తల్లిదండ్రులు మందలించారనే కోపంతో ఇంటినుంచి వెళ్లిపోయిన 14 ఏళ్ల యువతి తన ప్రియుడి దగ్గరకు వెళ్లింది. అతడు తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక, ఆ తర్వాత ఆ యువతిని పశ్చిమగోదావరి జిల్లాలోని పలు వ్యభిచార గృహాలకు రోజులచొప్పున అమ్మేశాడు. సెప్టెంబర్ 11న ఇంటి నుంచి వెళ్లిన కూతురు తిరిగిరాకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
భార్యను చంపి భర్త పరారీ

ఇదిలావుంటే, ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం తిమ్మాయిపాలెంలో ఓ భర్త భార్యను చంపి పరారయ్యాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన తిమ్మాయిపాలెంలో విషాదం అలుముకుంది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
చిత్తూరు జిల్లా గంగవరం మండలం పత్తికొండ దగ్గర బెంగళూరు జాతీయ రహదారిపై కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసులు వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కిడ్నాప్‌నకు యత్నం
నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లెలో ఇద్దరు పదో తరగతి విద్యార్థులను కిడ్నాప్ చేసేందుకు ఓ ఆటో డ్రైవరు యత్నించాడు. ఆటోలో నుంచి విద్యార్థులు కిందకు దూకటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. స్థానికులు వారిని గమనించి కేకలు వే యడంతో ఆటోడ్రైవరు పరారయ్యాడు.












Click it and Unblock the Notifications