15 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్: ఇద్దరి అరెస్టు

Two arrested for raping 15-year-old in Hyderabad
హైదరాబాద్: 15 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. హైదరాబాదు నుంచి అమ్మాయిని తీసుకుని వెళ్లి నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆ అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.

బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఒకతను సాతామ్రాయికి చెందిన ఆటో రిక్షా డ్రైవర్ బండి సునీల్ కుమార్ (24) కాగా, మరొకతను రాజేంద్రనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ విశ్వనాథ్ జగదీష్ (21). పనికి వెళ్తుండగా వారిద్దరు అమ్మాయిని అపహరించారని పోలీసులు తెలిపారు.

అమ్మాయిని తొలుత యాదిగిరిగుట్టకు తీసుకుని వెళ్లి, ఆ తర్వాత హైదరాబాదులోని ఉప్పల్‌కు తీసుకుని వచ్చి ఆమెపై రెండు రోజుల పాటు అత్యాచారం చేశారు. అమ్మాయి తనకు ప్రపోజ్ చేసిన శ్రీనును కూడా గుర్తించింది.

బుధవారంనాడు ఆమెను నిందితులు మెహిదీపట్నం తీసుకుని వచ్చారని, వారు నిద్రపోతుండగా అమ్మాయి తప్పించుకుని బహదూర్‌పురా చేరుకుందని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి సురేష్ అనే వ్యక్తికి అమ్మాయి ఫోన్ చేసింది. సురేష్‌తో పాటు వదిన అక్కడికి వచ్చి అమ్మాయిని తీసుకుని వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+