Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిత్తూరు జిల్లాలో రెండు కార్లు ఢీ.. ముగ్గురి మృతి, ముగ్గురు పరిస్థితి విషమం !!

ఏపీలోని నగరి మండలం తడుకుపేట వద్ద జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం సర్వత్రా విషాదం నింపుతోంది. తిరుచానూరు నుంచి తిరుత్తణి వైపు వెళ్లుతున్న ఒక కారు.. చెన్నై నుంచి తిరుమల దిశగా వస్తున్న మరో కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఢీకొన్న రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

ఘటన ఎలా జరిగింది?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోటు కార్మికులు శంకర్, సంతానం తిరుచానూరు నుంచి మరో ప్రాంతానికి కారులో బయలుదేరారు. వారు నగరి తడుకుపేట వద్దకు చేరుకున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారు అతివేగంగా వచ్చి వారి కారును ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి.. ప్రత్యక్ష సాక్షుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

two-cars-collide-leads-to-three-dead-and-three-in-critical-condition-at-chittoor-district

ప్రమాదంలో తిరుచానూరుకు చెందిన శంకర్, సంతానం అనే ఇద్దరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పోటు కార్మికులుగా పనిచేస్తున్నవారు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే చెన్నైకి చెందిన అరుణ్ అనే మరొక వ్యక్తి కూడా ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. వీరితో పాటు మరో ముగ్గురు తమిళనాడుకు చెందిన వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన మరొకసారి రోడ్డు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ప్రభుత్వ చర్యలు ఉన్నప్పటికీ అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ఓవర్టేకింగ్‌ లో జాగ్రత్తలు లేకపోవడం వంటి అంశాలు ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. మరోవైపు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు ఈ ఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రోజూ కలిసి పనిచేసే స్నేహితులను ఒక్క క్షణంలో కోల్పోవడం స్థానిక వాతావరణాన్ని విషాదంతో నింపేసింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రమాదానికి సంబంధించిన కేసును పోలీసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రెండు కార్ల వేగం, బ్రేక్ మార్కులు, రహదారి పరిస్థితులు, డ్రైవర్ల నిర్లక్ష్యం వంటి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. అవసరమైతే సీసీ కెమెరా ఫుటేజీని కూడా పరిశీలించనున్నట్లు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+