వామ్మో.. చికెన్ మసాలా అనుకొని పురుగుల మందు వేసింది, ఇద్దరు చిన్నారుల మృత్యువాత..
మనవళ్లు వచ్చారు కదా.. అని అమ్మమ్మ చికెన్ వండింది. కానీ చికెన్ మసాలాకు బదులు పురుగుల మందు వేసింది. వృద్దురాలు కావడంతో.. చికెన్ మసాలా పక్కనే పురుగుల మందు కనిపించలేదు. కూర వండటం పూర్తయ్యాక.. ఆమె కూడా ఆరగించారు. అయితే భోజనం చేశాక పిల్లలతో సహా వృద్దురాలు కూడా అస్వస్థతకు గురై ప్రాణాలతో పోరాడుతున్నారు. వృద్దురాలికి మతిమరుపు ఉంది అని, అందుకే మసాలాకు మందు విష గుళికలు వేసిందని స్థానికులు చెబుతున్నారు.
చిత్తూరు జిల్లా చెర్లోపల్లి గ్రామానికి చెందిన ధనమ్మ.. కూతురు జీవ, రోహిత్ సోమవారం అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. సెలవులు కావడంతో వెంగమాంబ పురం పంచాయతీ ఏయల్ పురానికి వచ్చారు. పిల్లలు రావడంతో వృద్దురాలు చికెన్ తీసుకొచ్చి వండింది. కానీ చికెన్ మసాలా వేద్దామని అనుకోవడమే పాపమైపోయింది. పక్కనే గల పురుగుల మందును వేసింది. అయితే ఆ విషయం ఆమెకు తెలియలేదు. తర్వాత పిల్లలతో కలిసి భోజనం కూడా చేసింది.

లంచ్ పూర్తయ్యాక వారు అస్వస్థకు గురయ్యారు. వెంటనే స్థానికులు చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు చనిపోయారు. గోవిందమ్మ పరిస్థితి విషమంగా ఉంది అని వైద్యులు తెలిపారు. ఘటనపై గుడిపాల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications