వివాహేతర సంబంధం ప్రాణం తీసింది
విజయవాడ: ఫేస్‌బుక్ పరిచయంతో ఎర్పడిన అక్రమ సంబందం రెండు నిండు ప్రాణాలను బలిగోంది. కృష్ణ జిల్లా జగ్గయ్యపెట మండలం తోర్రగుంటపాల్లెంలో ప్రియురాలి మృతికి మనస్తాపం చెంది విన్నుకొండ వెంకటేష్ అనే 26 సంవత్సరాల యువకుడు ఉరి వేసుకొని మృతి చెందాడు. జగ్గయ్యపెట మండలం తోర్రగుంటపాలెం కు చెందిన వెంకటేష్.. అదే గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే వివాహతతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. వీరు ఇలా చాలాకాలంగా తరచూ బయట కలుస్తూ ఉండేవారు. ఫేస్‌బుక్ ద్వారా చాటింగ్‌లు చేసేవారు. విషయం తెలుసుకున్న వరలక్ష్మి భర్త ఈ విషయాన్ని వరలక్ష్మి తల్లతండ్రులకు చెప్పి ఆమెను బజారుకీడ్చాడు. దీంతో మనస్థాపానికి గురైన వరలక్ష్మి.. వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.












Click it and Unblock the Notifications