విశాఖలో బాలుడి బ్రెయిన్‌డెడ్: అవయవదానానికి తల్లిదండ్రులు అంగీకారం
అమరావతి: విశాఖలో బ్రెయిన్‌డెడ్ అయిన కుమారుని అవయవదానానికి తల్లిదండ్రులు అంగీకరించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా సబ్బవరానికి చెందిన హరనాథ్ (17) ఈనెల 21న సబ్బవరం కూడలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
చికత్స నిమిత్తం వెంటనే బాలుడిని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఆరోజు నుంచి ఈనాటి వరకు చికిత్స అందించిన వైద్యులు శుక్రవారం హరనాథ్ బ్రెయిన్‌డెడ్ అయినట్లు శనివారం ప్రకటించారు. ఆ తర్వాత ఆసుపత్రి వైద్యులు హరినాథ్ తల్లి పుష్పలత, బంధువులకు అవయవ దానంపై అవగాహన కల్పించారు.

దీంతో హరనాథ్ అవయవాలు దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకొచ్చారు. హరనాథ్ గుండె, మూత్రపిండాలు, కాలేయం, నేత్రాలు దానంగా ఇచ్చారు. గుండెను చెన్నై, మూత్రపిండాలు విశాఖ కేర్ ఆసుపత్రికి, కాలేయం మణిపాల్ ఆసుపత్రిలోని ఒక రోగికి, నేత్రాలు మొహిసిన్ నేత్రాలయానికి ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు.
కాగా, 17 ఏళ్ల హరినాథ్ ఎన్‌ఏడీ కూడలిలోని చైతన్య కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుమారుని మృతితో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగింది.
అంబులెన్స్‌ను ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు నుంచి తణకు ఆసుపత్రికి వెళ్తోన్న అంబులెన్స్ జిల్లాలోని తాడేపల్లి గూడెం బాదంపూడి రోడ్డు వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లోని రోగి, రోగితో పాటు ఉన్న మహిళ మృతి చెందారు. ఈ ఘటనలో మరో అంబులెన్స్ సిబ్బంది ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే తాడేపల్లిగూడెంలోని ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన అంబులెన్స్ సిబ్బంది పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications