సికింద్రాబాద్‌లో విషాదం, బంధువుల రోదన (పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాదులోని ఓ బహుళ అంతస్తుల సముదాయం నిర్మాణానికి తవ్విన సెల్లార్‌ను ఆనుకొని ఉన్న ప్రహరీ గోడ ప్రమాదవశాత్తు కూలిపోయింది. దీంతో నిర్మాణం పనుల్లో ఉన్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వారు ఇరవై అడుగులకు పైగా మట్టిలో కూరుకుపోయారు.
సరోజినీదేవి రోడ్డులోని సంగీత్ జంక్షన్ సమీపంలో కొత్తగా ఓ భవన సముదాయాన్ని నిర్మిస్తున్నారు. రెండు సెల్లార్ అంతస్తుల కోసం ఏకంగా 40 అడుగులకు పైగా లోతులో గొయ్యి తవ్వారు. ఈ భవనం నిర్మాణం వల్ల పరిసరాల్లోని కట్టడాలు దెబ్బతింటాయని ఫిర్యాదులు రావడంతో కొన్ని రోజులుగా అధికారికంగా పనులు నిలిపివేయించారు.
అయితే పనులు మాత్రం జరుగుతున్నాయని చెబుతున్నారు. శనివారం మధ్యాహ్నం సెల్లార్ భాగంలో రిటైనింగ్ వాలు పనులు చేపడుతుండగా వరంగల్ జిల్లా పీసర గ్రామానికి చెందిన రాజయ్య, కరీంనగర్ జిల్లాకు చెందిన శారదలు మృతి చెందారు.

ప్రమాదం
అధికారుల అలసత్వం, బిల్డర్ల నిర్లక్ష్యంతో సికింద్రాబాద్ నడిబొడ్డున సెల్లార్ మట్టికూలి ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. వరంగల్ జిల్లా పీసర గ్రామానికి చెందిన చిన్నరాజయ్య, కరీంనగర్ జిల్లాకు చెందిన శారద మరో ఇద్దరు వ్యక్తులు సంగీత్ థియేటర్ చౌరస్తాకు సమీపంలోని సెయింట్ ఆన్స్ స్కూల్ ఎదురుగా బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి చేపట్టిన దాదాపు 60 ఫీట్ల సెల్లార్‌లో మట్టిపని చేస్తున్నారు.

ప్రమాదం
సాయంత్రం సమయంలో ఒక్కసారిగా పైనుంచి మట్టిపెళ్లలు విరిగిపడడంతో శారద, రాజయ్య మట్టిలో కూరుకుపోగా మరోవ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు.

ప్రమాదం
సంఘటన జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి బాధితులను వెలికితీసే కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రమాదం
జెసిబితో మట్టి తొలగిస్తున్న సమయంలో మట్టిలో కూరుకుపోయిన రాజయ్య కడుపులో జెసిబి దిగి పేగులు బయటికి రాగా శారద తల, మొండెం తెగిపోయింది. కేసును నమోదు చేసుకుని గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదం
ప్రమాదంలో మృతి చెందిన రాజయ్యకు భార్య ఇద్దరు అమ్మాయిలు, శారదకు భర్త చనిపోగా ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయిలు ఉన్నారు.

ప్రమాదం
కుటుంబాన్ని పోషించే వారు చనిపోవడంతో పిల్లలు వారి కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారిపోయింది.

ప్రమాదం
మృతులు ఇద్దరు కూడా తమ తమ కుటుంబాలతో సికింద్రాబాద్ అడ్డగుట్ట ఆజాద్ చంద్రశేఖర్ నగర్‌లో నివాసముంటున్నారు. సంఘటనా స్థలాన్ని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ప్రమాదం
బిల్డర్‌తో మాట్లాడి మృతుల కుటుంబాలకు చెరో పది లక్షల రూపాయల ఇప్పించడానికి ఒప్పించారు. ఒక్కరోజులో బాధిత కుటుంబాలకు డబ్బు ముట్టచెప్పే ఏర్పాట్లు చేయనున్నామని చెప్పారు.

ప్రమాదం
ఇదిలా ఉంటే ఎవరైనా చిన్న నిర్మాణం చేపడితే నిబంధనలతో ఇబ్బందులు పెట్టే అధికారులకు ఇక్కడ ఇంతపెద్ద దారుణం జరుగుతున్నా ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. కాగా, నగర మేయర్ మాజీద్ హుస్సేన్ తదితరులు సంఘటన స్థలాన్ని సందర్సించారు.

ప్రమాదం
సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, సికింద్రాబాద్ టిడిపి ఇన్‌చార్జ్ కూన వెంకటేశ్ గౌడ్ తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications