తిరుమలలో చెట్టు కూలి ఇద్దరు భక్తుల దుర్మరణం
తిరుపతి: తిరుమలలోని వాటర్ వర్క్స్ సమీపంలో మంగళవారంనాు భారీ యూకలిప్టస్ వృక్షం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. వందలాది మంది సురక్షితంగా బయటపడ్డారు.
రూ. 300 క్యూలో దాదాపు 200 మంది నిరీక్షిస్తుండగా ఈ చెట్టు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించి, ముగ్గురు గాయపడగా మిగతా వారంతా క్షేమంగా బయటపడ్డారు. క్యాబ్ డ్రైవర్ కె. మధు (35), చెన్నైకి చెందిన భక్తురాలు ఎం సరోజ (50) మరణించారు.

కూలిన చెట్టు కొమ్మల కింద వారు చిక్కుపడిపోయారు. గాయపడిన ముగ్గురు భక్తులను ఎస్‌విఆర్ఆర్ ప్రభుత్వ ఆస్పత్రి, శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్జాన సంస్థలో చేర్చారు. సంఘటనతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
దామా మధు, టిటిడి ఆధ్వర్యంలోని శ్రీవెంకటేశ్వర భక్తి చానెల్ సమన్వయకర్త నందినీరాజనంలకు కూడా గాయాలయ్యాయి. ఓ బైక్ దెబ్బ తింది.












Click it and Unblock the Notifications