స్వైన్ ప్లూ: గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు మృతి
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ప్లూతో మరో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు శుక్రవారం ప్రకటించారు. చాదర్‌ఘాట్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు, సయ్యద్ నగర్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి స్వైన్ ప్లూ చికిత్స పొందుతూ మృతి చెందారు.
గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 36 మంది స్వైన్ ప్లూ చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. వ్యాధి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

శీతల వాతావరణంలో, బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వ్యక్తులు వ్యక్తిగతంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మెదక్ జిల్లాలో 8 నెలల బాలుడికి స్వైన్ ప్లూ నిర్ధారణ అయిందని నోడల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు.












Click it and Unblock the Notifications