వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు "నానీ"లు ఎన్నికల్లో పోటీకి దూరంగా - తాజా పరిణామాలతో..!!

|
Google Oneindia TeluguNews

YSRCP Decisions: ఏపీలో ముందస్తుగానే ఎన్నికల కసరత్తు మొదలైంది. దాదాపు ఏడాదిన్నార సమయం ఉన్నా.. పార్టీలు అభ్యర్ధుల ఎంపిక పైన ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్ధుల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆరు నెలల ముందే అభ్యర్ధుల ప్రకటనకు సిద్దం అవుతున్నారు. టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. వైసీపీలో ఎమ్మెల్యేల పని తీరు ఆధారంగానే సీట్టు ఉంటాయని సీఎం తేల్చారు. మధ్యలో వారసుల వ్యవహారం పైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలోనే.. సీఎం జగన్ తొలి కేబినెట్ లో పని చేసిన ముగ్గురు "నానీ"లు వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇది ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

వైసీపీలో అభ్యర్ధులను ఖరారు చేస్తున్న సీఎం జగన్

వైసీపీలో అభ్యర్ధులను ఖరారు చేస్తున్న సీఎం జగన్

వైసీపీ 2019 ఎన్నికల్లో అనూహ్యంగా 151 సీట్లు గెల్చుకుంది. ఇప్పుడు 2024 ఎన్నికల దిశగా సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా టీడీపీ సిట్టింగ్ నియోజకవర్గాల్లో అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేలే ఆ పార్టీ అభ్యర్దులు కావంతో..ఆ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. కుప్పం, టెక్కలి, అద్దంకి, విశాఖ నార్త్, మండపేట అభ్యర్దులకు ముఖ్యమంత్రి ఖరారు చేసారు. ఇదే సమయంలో ప్రాంతీయ - సామాజిక సమీకరణాల విషయంలో ముఖ్యమంత్రి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పాటుగా ప్రజలతో సత్సంబంధాలు..ఖచ్చితంగా గెలుస్తారని భావించిన వారికే తిరిగి సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పష్టం చేసారు. ఇప్పటి వరకు 32 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం అంచనాలకు అందుకోలేకపోతున్నారని సర్వే లెక్కలు తేల్చాయి. వీరికి సరిదిద్దుకొనేందుకు సీఎం జగన్ డెడ్ లైన్ ఫిక్స్ చేసారు. ఆ తరువాత పరిస్థితుల్లో మార్పు రాకుంటే పార్టీ ఫస్ట్.. లీడర్ నెక్స్ట్ విధానంలో నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు.

వారుసల విషయంలో డెసిషన్ పెండింగ్..

వారుసల విషయంలో డెసిషన్ పెండింగ్..

మాజీ మంత్రులు..సీనియర్ల విషయంలోనూ పనితీరు ప్రాతిపదకనే సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు..జిల్లా అధ్యక్షలు విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆయన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ఇక, ఇప్పుడు వైసీపీలో పలువురు సీనియర్లు ఈ సారి తమ వారసులను బరిలోకి దించేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.కానీ, సీఎం తుది నిర్ణయం ఎలా ఉంటుంనేది వారిలో గుబులు రేపుతోంది. కొందరి విషయంలో సీఎం జగన్ ఇప్పిటికే అనుమతి ఇచ్చారు. కొందరు సీనియర్లు మాత్రం తనతోనే ఉండాలని సీఎం కోరుతున్నారు. అందులో ఆర్డిక మంత్రి బుగ్గన.. మాజీ మంత్రి పేర్ని నాని లాంటి వారు ఉన్నారు. ఇక, వయోభారం - అనారోగ్య సమస్యల కారణంగా కొందరికి మినహాయింపు ఇస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ తొలి కేబినెట్ లో పని చేసిన ముగ్గురు "నానీ" ల్లో వచ్చే ఎన్నికల్లో ఇద్దరు పోటీకి దూరంగా ఉండటం దాదాపు ఖాయం గా మారింది.

ఎన్నికల్లో పోటీ చేయం.. పార్టీకి సేవ చేస్తాం

ఎన్నికల్లో పోటీ చేయం.. పార్టీకి సేవ చేస్తాం

మాజీ మంత్రుల్లో ఆళ్ల నాని..పేర్ని నాని ఈ సారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు. పేర్ని నాని తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరగా.. సీఎం పార్టీ నేతల సమక్షంలోనే నో చెప్పారు. పేర్ని నాని తనతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నానని..ఈ సారి పోటీ లో ఉంటారంటూ తేల్చి చెప్పారు. తాజాగా సీఎంను కలిసిన సమయంలో తన స్థానంలో తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరారు. తాను పార్టీలో ఎన్నికల్లో గెలుపు కోసం పని చేస్తానని చెప్పటంతో.. చివరకు సీఎం అంగీకరించినట్లు తెలుస్తోంది. అతే విధంగా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని సైతం ఈ సారి ఎన్నికల్లో దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు ప్రచారం సాగుతోంది. ఆయనకు జగన్ డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఆళ్లా నానితో కేబినెట్ నుంచి తొలిగిస్తున్న విషయం ముందుగానే సీఎం చర్చించారు. అయితే, మాజీ అయినప్పటి నుంచి ఆళ్ల నాని యాక్టివ్ గా లేరని పార్టీలో చర్చ సాగుతోంది. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం పైన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో, ఎన్నికల నాటికి ఈ ఇద్దరి విషయంలో ఇదే నిర్ణయం కొనసాగుతుందా, మారుతుందా అనేది చూడాల్సి ఉంది.

English summary
EX Ministers in CM Jagans cabinet Alla nani and Perni Nani decided to not contest for up coming electoins, CM yet to take final decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X