ఇద్దరు చిన్నారులపై బిస్కట్లు ఇస్తానని ఆశచూపి అత్యాచారం

కాకినాడ: ఇద్దరు చిన్నారులపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన శనివారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ మండలంలో చోటుచేసుకుంది. కాకినాడ సూర్యారావుపేట లైట్‌హౌస్‌ సమీపంలో ఆరు, ఏడు ఇద్దరు బాలికలు నివసిస్తున్నారు. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన బడి కృపారావు (35)ఈ బాలికల తండ్రికి తోడళ్లుడు.

ఈ క్రమంలో కృపారావు తరచూ వారి ఇంటికి రాకపోకలు సాగిస్తుంటాడు. శనివారం రాత్రి ఇంటి వద్ద చిన్నారులు ఆడుకుంటుండగా కృపారావు వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తానని చెప్పి సరుగుడు తోటలోకి తీసుకువెళ్లి ఇద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం వారిని రోడ్డుపై విడిచిపెట్టి వెళ్లిపోయాడు. చిన్నారులిద్దరికీ తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో తల్లిదండ్రులు వారిని జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతున్నారు. తిమ్మాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Rape

బంగారు నగల చోరీ

ఇదిలావుంటే, ప్రత్తిపాడు మండలంలోని గజ్జెనపూడి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఊరి చివర ఉన్న ఇంటిలోకి దుండగులు చొరబడి ఏడు కాసుల బంగారు ఆభరణాలు అపహరించారు. మండలంలోని గజ్జెనపూడి గ్రామశివారున జీడిపిక్కల ఫ్యాక్టరీ వెనుక ఉన్న ఇంటిలో దుండగులు చొరబడ్డారు. మంతిన వెంకటపతిరాజు లారీ డ్రైవర్‌గా విధులలో ఉండడంతో అతని భార్య ఇంటికి తాళం వేసి సమీపంలో ఉన్న అత్తగారి ఇంటివద్ద నిద్రపోయేందుకు వెళ్ళింది.

ఇంటివద్ద ఎవరూ లేకపోవడం గ్రామశివారున మారుమూలగా ఇళ్లు ఉండడంతో దుండగులు ఇంటి తాళాలను తెరిచి లోపలికి చొరపడ్డారు. దేవుడిమూల ఉన్న తాళాలగుత్తు సహాయంతో ఇంట్లో ఉన్న రెండు బీరువాలను తెరిచారు. బీరువాలోని నాలుగు నల్లపూసల గొలుసులు, మండచైను, మూడు ఉంగరాలతోపాటు మరో 15తులాల వెండి వస్తువులను, 40వేల నగదును అపహరించారు.

ఈ చోరీ సంఘటనలో లక్ష నుంచి లక్షా యాభైవేల వరకు బంగారు వెండి వస్తువులు నగదు కాజేసినట్లు బాధితులు చెబుతున్నారు. బాధితుడు మంతిన వెంకటపతిరాజు ఫిర్యాదు మేరకు ప్రత్తిపాడు సీఐ సత్యనారాయణ, అదనపు ఎస్‌ఐ జి.రమేష్‌బాబులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ క్లూస్‌ టీం బృందం సంఘటన స్థలానికిచేరి వేలిముద్రల సేకరించారు.. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+