ఢిల్లీ సమీపంలో బస్సు ప్రమాదం: ఏపీ వాసుల మృతి, 20మందికి తీవ్రగాయాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన యాత్రికుల్లో ఇద్దరు మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆగ్రా-యమున ఎక్స్‌ప్రెస్ వేపై వెళ్తున్న సమయంలో ఆ టూరిస్ట్ బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకుని రోడ్డు పక్కన ఆగివున్న ట్యాంకర్‌ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, ట్రావెల్స్ ఏజెంట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరినీ కొటికలపూడి గ్రామానికి చెందని వారిగా గుర్తించారు. క్షతగాత్రులను నోయిడాలోని కైలాష్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన ఢిల్లీ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

ప్రకాశం జిల్లా అద్దంకి సమీప గ్రామాలకు చెందిన 40 మంది యాత్రికులు ఉత్తరాది యాత్రలకు బయలుదేరారు. ఢిల్లీ, ఆగ్రాతో పాటు షిర్డి దర్శించకుని స్వగ్రామాలకు చేరుకోవాలని ప్రణాళిక చేసుకున్నారు.
కాశీకి వెళ్లివస్తుండగా ఈ రోడ్డుప్రమాదం జరిగింది. కాగా, సల్ప గాయాలతో బయటపడ్డ యాత్రికులు అక్కడ నుంచి మరో బస్సులో స్వగ్రామాలకు చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications