వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి అచ్చెన్నను జ్యోతిష్యుడు బ్లాక్‌ మెయిల్ ఉదంతం...అసలేం జరిగిందంటే...

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: గ్రహాలు బాగాలేవని మంత్రికి పూజలు చేసాడు...డబ్బు దస్కం బాగానే దండుకున్నాడు...అయినా ఆశ తీరలేదు...భారీ మొత్తంలో సొమ్ము రాబట్టాలని మంత్రికే బెదిరింపు కాల్స్ చేశాడు...చివరకు తన గ్రహ స్థితి బాగోక పోలీసులకు పట్టుబడ్డాడు...అడ్డాదారిలో డబ్బు సంపాదించాలని అడ్డంగా బుక్కయిన ప్రముఖ జ్యోతిష్యుడు కాళిదాసు శర్మ ఉదంతమిది.
మంత్రి అచ్చెన్నాయుడుకు వరుస బెదిరింపు కాల్స్ వెనుక రహస్యాన్ని సిక్కోలు పోలీసులు ఛేదించారు. మీడియా సమావేశంలో ఎస్పీ త్రివిక్రమవర్మ వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ ఘటన వెనక వాస్తవాలు ఇవి... విజయనగరం జిల్లా పార్వతీపురంలో జ్యోతిష్యుడిగా, యాజిగా పేరుగాంచిన మురపాక కాళిదాసుశర్మ ఉత్తరాంధ్రలో ప్రముఖులకు నిత్యం టచ్‌లో ఉంటూ వారికి గ్రహా లు అనుకూలంగా లేవని శాంతిహోమాలు, ప్రత్యేకపూజలు జరిపించాలని మాయమాటలు చెప్పి భారీగా డబ్బు దండుకునేవాడు. తన అక్రమాలకు సహాయంగా ఉండేందుకని అనుచరుడిగా ఒడిసా రాయగడలో నివాసముంటున్న జోస్యుల శంకరరావును ఎంచుకున్నాడు.

లక్షలు కాదు...కోట్లు సంపాదించాలని...

లక్షలు కాదు...కోట్లు సంపాదించాలని...

విజయనగరం జిల్లా పార్వతీపురంలో జ్యోతిష్యుడిగా, యాజిగా పేరుగాంచిన మురపాక కాళిదాసుశర్మ ఎక్కువగా ప్రముఖుల ప్రాపకం కోసమే ప్రయత్నించేవాడు. వారివద్దకు ఎలాగోలా చేరుకొని మీకు గ్రహాలు అనుకూలంగా లేవనో, శాంతి చేస్తే మరింత మంచి జరుగుతుందనో ఇలా ఏవో మాయమాటలు చెప్పి పూజలు, యాగాల పేరుతో బాగానే డబ్బు గుంజేవాడు. కానీ ఇలా లక్షల్లో డబ్బు సంపాదిస్తే ఎప్పటికి వందల కోట్లు సంపాదించగలననుకున్నాడో ఏమో ఈసారి ట్రెండ్ మార్చాలని డిసైడ్ అయ్యాడు. ఇలా గ్రహాల పేరుతో బెదిరించడం కాకుండా మరో రకంగా బెదిరిస్తే

ఫస్ట్ టార్గెట్...మంత్రి అచ్చన్నే...

ఫస్ట్ టార్గెట్...మంత్రి అచ్చన్నే...

రెండు నెలల క్రితమే మంత్రి అచ్చంనాయుడు తనతో పూజలు చేయించుకోవడం...ఆ పూజలకు బాగానే గిట్టుబాటు కావడంతో తన మరో బెదిరింపు ప్లాన్ కూడా అచ్చంనాయుడు మీదే అప్లయి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఇక అనుచరుడితో కలిసి స్కెచ్ వేశాడు. దాని ప్రకారం రాయగడలో ఓ సెల్‌ దుకాణంలో గిరిజనుడి పేరిట సిమ్‌ కొనుగోలు చేసి, టెక్కలిలోని మంత్రి అచ్చంనాయుడు అనుచరుడికి ఫోన్‌ చేసి తాము నక్సలైట్లమని, అచ్చెన్నను చంపేస్తామని హెచ్చరించారు. బెదిరింపులో డెప్త్ ఉండాలని హెచ్చరికలను నిజమని భావించేలా చేసేందుకు శంకర్రావు ఒడిసా నుంచి జిలెటిన్‌ స్టిక్స్‌ తెప్పించి అచ్చెన్న పయనించే మార్గంలో ట్రాఫిక్‌ సిబ్బంది ఏర్పాటుచేసిన టైర్లలో అమర్చాడు. ఆ విషయం కూడా అనుచరుడికి తెలిపి కావాలంటే చెక్ చేసుకోమన్నాడు.

బెదిరింపులు...పోలీసుల రంగప్రవేశం...

బెదిరింపులు...పోలీసుల రంగప్రవేశం...

చివరకు ఈ విషయం పోలీసుల వద్దకు చేరింది. మంత్రి అనుచరుడికే ఫోన్ చేసి ఇలా బెదిరింపుల మీద బెదిరింపులకు పాల్పడుతుండటంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకవైపు ఫోన్ కాల్స్ మీద నిఘా పెట్టి మరోవైపు తనిఖీలు ముమ్మరంచేసి జిలెటిన్‌ స్టిక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు వేగవంతం చేయడంతో ముందు అనుచరుడు శంకర్రావు పోలీసులకు పట్టుబడ్డారు. అతన్ని విచారించగా విషయం చెప్పేశాడు. దీంతో కాళిదాసు శర్మను కూడా అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్పీ తివిక్రమవర్మ తెలిపారు.

ఫోన్ కాల్స్...పట్టిచ్చాయి...

ఫోన్ కాల్స్...పట్టిచ్చాయి...

ఈ విధంగా జ్యోతిష్యుడు, అతని అనుచరుడు పట్టుబడటానికి ప్రధాన కారణం ఫోన్ కాల్స్ వల్లేనని తెలిసింది. 2017 నవంబర్‌ 11న పార్వతీపురంలో కాళిదాసుశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సౌభాగ్య విద్యేశ్వరి పంచాయతన యాగంలో అచ్చెన్నాయుడు సతీ సమేతంగా పాల్గొన్నారు. గ్రహస్థితి అనుకూలించేందుకు అచ్చెన్న ఇదే జ్యోతిష్యుడితో పూజలు చేయించుకున్నారని తెలిసింది. ఆ పూజల సందర్భంగా మంత్రి ఈ జ్యోతిష్యుడికి సుమారు రూ.80 లక్షలు ఇచ్చారని కూడా ఇక్కడ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పూజల సందర్భంగా మంత్రి అచ్చన్న నంబర్ ఈ జ్యోతిష్యుడికి చేరడం వల్ల ముందుగా అచ్చన్ననే టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఫోన్ కాల్స్ చివరకు వీరి ఆట కట్టించడానికి కారణమయ్యాయని విశ్వసనీయ సమాచారం.

English summary
Srikakulam: Two persons were taken into custody in the town by police on Sunday for discussing among themselves over phone about threats to the life of Transport Minister K Atchannaidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X