ఉద్యోగం ఇప్పిస్తామని మహిళపై గ్యాంగ్‌రేప్ యత్నం
హైదరాబాద్: ఉద్యోగం ఇప్పిస్తామని ఓ మహిళకు ఆశచూపిన ఇద్దరు యువకులు ఆమెను కారులో తీసుకెళుతూ అత్యాచారం చేసేందుకు యత్నించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. భవానీకాలనీలో ఉండే మహిళ(28) నాలుగేళ్ల క్రితం భర్తతో విడిపోయింది. ఆమె ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసుకుని స్వశక్తితో జీవించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే భవానీకాలనీ పక్కనే ఉండే ప్రేమావతీపేటకు చెందిన మోహిద్(26), అమ్జద్ (25) అనే యువకులు ఆమెకు నర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని మంగళవారం మధ్యాహ్నం తమ కారులో తీసుకెళ్లారు.

ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో ఆమె వారితోపాటు వెళ్లింది. కాగా, నిందితులు కారులో ఆమెపై చేయివేసి అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచారానికి యత్నించారు.
నిందితుల బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆ మహిళ, అదే రాత్రి రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.












Click it and Unblock the Notifications