సరయూ నదిలో ఇద్దరు హైదరాబాద్ విద్యార్థుల గల్లంతు

విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తమతో వచ్చిన విద్యార్థులు నదిలో గల్లంతవడంతో మిగిలిన విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మాల్కాజ్‌గిరి సర్కిల్ గౌతమ్‌నగర్ డివిజన్‌కు చెందిన వాణీనగర్ నివాసి కృష్ణ కిషోర్ కుమారుడు చక్రపాణి(20), డబీర్‌పురాకు చెందిన కిరణ్(20) గల్లంతైనట్లు గుర్తించారు.
అల్వాల్‌కు చెందిన విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థుల బృందం సోమవారం వరంగల్ నుంచి అయోధ్యకు రైలులో బయలుదేరారు. మంగళవారం సాయంత్రం అయోధ్యకు చేరుకున్న వారు బుధవారం సరయూ నదిలో స్నానానికి దిగారు. ఈ క్రమంలో చక్రపాణి, కిరణ్ గల్లంతయ్యారు. చక్రపాణి ఎన్ఐఐటి నవోదయలో ఐటి కోర్సు చేస్తున్నాడు. సహాయ చర్యలు అందించేందుకు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.
జూన్ 8వ తేదీన విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్‌లోని విజ్ఞాన జ్యోతి కళాశాలకు చెందిన 24 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో లార్జి డ్యాం నుంచి ఆకస్మికంగా నీరు వదలడంతో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.
బియాస్ నదిలో గల్లంతైన వారిలో 21 మంది విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో మూడు మృతదేహాల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, ఈ విషాద ఘటన మరువక ముందే మరో ఘటన జరగడం తెలుగు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.












Click it and Unblock the Notifications