ప్రమాదంలో టెక్కీల మృతి, అక్రమసంబంధం కోసం హత్య

 Two techies found dead
హైదరాబాద్/విజయవాడ: హైదరాబాదులోని రాజేంద్రనగర్ నార్సింగి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్టువేర్ ఇంజనీర్లు దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికి అక్కడే మృతి చెందారు.

తల్లీకూతుళ్ల దారుణ హత్య

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లపల్లిలో తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. చందమ్మ, చిన్నిలు బుధవారం రాత్రి ఆరు బయట నిద్రిస్తుండగా అఱటికాయల వ్యాపారి శివయ్య కత్తితో నరికి వారిని కిరాతకంగా హత్య చేశాడు. చిన్నితో అక్రమ సంబంధం కోసం వేధిస్తున్న శివయ్య ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఇద్దరు గల్లంతు

గుంటూరు జిల్లాలో సముద్ర తీరంలో స్నానానికి వెళ్లన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. గుంటూరుకు చెందిన వీరు బాపట్ల మండలం కృపానగర్‌లో బుధవారం ఓ పాస్టర్ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో గురువారం ఉదయం సముద్ర స్నానానికి వెళ్లారు. ఆ సమయంలో సముద్రంలో అలలు రావడంతో అలల తాకిడికి సముద్రంలో గల్లంతయ్యారు. వారి కోసం మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు.

లారీ ఢీకొని ఇద్దరు మృతి

నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పడగల్ క్రాస్ రోడ్డు వద్ద గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కరీంనగర్ జిల్లా మెట్ పల్లికి చెందిన కారు నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ నుండి మెట్ పల్లికి వస్తుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+