గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు నివాసం వద్ద మహిళల హంగామా, భద్రతా సిబ్బంది బెంబేలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద బుధవారం ఇద్దరు మహిళలు అలజడి సృష్టించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద ఉదయం జరిగింది.

అందుకే బాబుతో ఎక్కువ సేపు మాట్లాడలేదు: రాజమౌళిఅందుకే బాబుతో ఎక్కువ సేపు మాట్లాడలేదు: రాజమౌళి

మహిళ హంగామా.. భద్రతా సిబ్బంది బెంబేలు

మహిళ హంగామా.. భద్రతా సిబ్బంది బెంబేలు

ఇద్దరు మహిళలు చేపట్టిన నిరసనతో భద్రతా సిబ్బంది బెంబేలెత్తారు. కామాక్షి అనే మహిళ మైలవరం ప్రాజెక్టులో తన ఇల్లు పోయిందని, ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆందోళనకు దిగారు.

చచ్చిపోతానని బెదిరింపు

చచ్చిపోతానని బెదిరింపు

మూడురోజులుగా ముఖ్యమంత్రిని కలిసేందుకు సచివాలయం వద్ద ఎదురు చూసినా లాభం లేకపోయిందని ఆమె వాపోయారు. చేసేదిలేక ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రికి తన సమస్య వివరించాలని పట్టుబట్టారు. తనకు న్యాయం చేయకపోతే చచ్చిపోతానంటూ బెదిరించారు.

సెక్యూరిటీ అధికారి వచ్చి చెప్పినా

సెక్యూరిటీ అధికారి వచ్చి చెప్పినా

దీంతో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది ఆమెతో మాట్లాడి ఆమె వివరాలను సెక్యూరిటీ చీఫ్‌కు తెలిపారు. ఈలోపు మరో మహిళ తన సమస్యలను ముఖ్యమంత్రికి వివరించాలని అలజడి రేపింది. ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారి స్వయంగా వచ్చి మాట్లాడినా ఆమె శాంతించలేదు.

ఆ తర్వత భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చుకుంది

ఆ తర్వత భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చుకుంది

దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఇతర సిబ్బంది వచ్చి సమస్యలు చెప్పుకోవడానికి సచివాలయానికి వెళ్లాలని ఆ ఇద్దరు మహిళలకు నచ్చ చెప్పారు. దీంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకుంది.

English summary
Two woman hungama at Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu residence at Undavalli
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X