ఆటోలో ఎక్కి మాటల్లో పెట్టారు: దిగాక చూసుకుంటే?, లబోదిబోమన్న మహిళ..
విశాఖపట్నం: ఓ మహిళను మాటల్లో పెట్టి.. ఆమె వద్ద నుంచి సుమారు రూ.10లక్షల విలువ చేసే ఆభరణాలతో పరారయ్యారు ఇద్దరు కి'లేడీ'లు. ప్రహ్లాదపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న క్రమంలోనే నగలు చోరీకి గురైనట్టు బాధితురాలు వెల్లడించారు.

పెళ్లికని వెళ్తే..:
పట్నాల కళావతి (52)-బాలవీరబ్రహ్మనంద దంపతులు హైదారాబాద్‌లోని లింగంపల్లిలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. ఇటీవల కళావతి సోదరి కుమారుడికి పెళ్లి నిశ్చయమవడంతో.. పెళ్లి కోసం ప్రహ్లాదపురం వెళ్లారు. పెళ్లికని వెళ్లిన ఆమెకు చోరీ రూపంలో ఊహించని షాక్ తగిలింది.

బంగారం లాకరులో పెట్టాలనుకుంది..:
ఈ నెల 3న పెళ్లి జరగ్గా.. వివాహానంతరం కళావతి కుటుంబ సభ్యులు హైదరాబాద్ వచ్చేశారు. కళావతి మాత్రం బాలాజీనగర్ లోని బంధువుల ఇంట్లోనే ఉండిపోయారు. వెంట తెచ్చుకున్న బంగారు ఆభరణాలను పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ లాకరులో భ్రదపరుచుకుని వెళ్దామనుకున్నారు.

కిలేడీల పనేనా?:
సోమవారం మధ్యాహ్నాం బంగారు ఆభరణాలు తీసుకుని కళావతి ఆంధ్రాబ్యాంక్ బయలుదేరారు. ఆటోలో వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో మరో ఇద్దరు మహిళలు కూడా అందులో ఎక్కారు.
కళావతిని మాటల్లో పెట్టిన ఆ ఇద్దరు ఆమెకు తెలియకుండా బంగారం చోరీ చేశారు. కళావతి ఆటో దిగాక చూసుకుంటే బంగారం కనిపించలేదు. ఆ ఇద్దరు మహిళలు మధ్యలోనే దిగిపోవడంతో వారి పైనే అనుమానం కలిగింది.

35తులాలు చోరీ..:
కళావతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గోపాలపట్నం బీఆర్టీఎస్ రహదారిలోని మేదరివీధి సమీపంలో ఆ ఇద్దరు ఆటో దిగారని, అప్పటివరకు ఎన్‌ఏడీ కొత్తరోడ్డు వరకు వస్తామన్నవారు కాస్త మధ్యలోనే దిగడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. 35తులాల బంగారం చోరీ అయినట్టు తెలిపారు. ప్రస్తుతం దీనిపై గోపాలపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications