కొరియర్ వచ్చిందని మహిళకు చెప్పి, బంగారం ఎత్తుకెళ్లారు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో దారుణం జరిగింది. కొరియర్ పార్సిల్ పేరుతో ఇద్దరు యువకులు ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న మహిళ నోటీకి ప్లాస్టర్ వేసి ఆమె వంటి పైన ఉన్న నగలను అపహరించుకుపోయారు.
ఏలూరు శేషా మహాల్ వీధిలో అనసూయ అనే మహిళ ఉంటోంది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఇద్దరు యువకులు మోటార్ సైకిళ్ల పైన వచ్చారు. మీకు కొరియర్ వచ్చిందని ఆమెకు చెప్పారు. అదే సమయంలో తమకు మంచి నీళ్లు ఇవ్వాలని అడిగారు.
దీంతో, ఆమె మంచి నీళ్లు ఇచ్చేందుకు లోపలకు వెళ్లింది. ఆమెతో పాటు లోపలకు వెళ్లిన యువకులు ఆమె నోటికి ప్లాస్టర్ అంటించారు. బలవంతంగా ఆమె కాళ్లు, చేతులు కట్టేశారు. ఆమె వద్ద నుంచి పదికాసుల బంగారాన్ని లాక్కెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

కారు బోల్తా ఒకరి మృతి
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలో ఓ కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాదులోని గోభారతి సంస్థ మేనేజర్లు హరి, శ్రీధర్ సోమవారం కదిరిలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
అనంతరం మంగళవారం కదిరి నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్తున్నారు. కల్లూరు గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారి పైన ప్రయాణిస్తున్న వారి కారు... ద్విచక్ర వాహనం అడ్డు రావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సీతాఫల్‌మండికి చెందిన హరి మృతి చెందగా, శ్రీధర్‌కుగాయాలయ్యాయి.
తణుకులో బాలుడి అపహహణ
పశ్చిమ గోదావరి జిల్లా తుణుకులో ఐదేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. పాఠశాలకు వెళ్తున్న బాలుడిని బైక్ పైన వచ్చిన దుండగులు ఎత్తుకు పోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications