Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సముద్రంలో ఇద్దరు యువకుల గల్లంతు(పిక్చర్స్)

విశాఖపట్నం: నగరంలో సముద్ర స్నానాలకు దిగిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. ఇందులో ఒకరు పాఠశాల విద్యార్థి కాగా, మరొకరు ఎవరన్నదీ ఇంకా వివరాలు తెలియరాలేదు. వీరి కోసం పోలీసులు సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నారు.

మురళీనగర్‌లోని అయ్యప్పకాలనీకి చెందిన మహ్మద్ షమిమ్(15) మాధవదార ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఉదయం 9గంటలకు సైకిల్‌పై బయటకు వచ్చాడు. షమిమ్ పాఠశాలకు వెళ్లకుండా సాయికుమార్, రాములుతో కలిసి సముద్రంలో స్నానం చేసేందుకు ఏయూ మహిళా వసతి గృహం సమీపంలోని తీరానికి చేరుకున్నారు.

సముద్రంలో కాసేపు స్నానం చేశారు. అనంతరం ఒడ్డుకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని మరో యువకుడు మహ్మద్ షమీమ్‌ను పిలిచి మళ్లీ స్నానం చేద్దామని రమ్మని ఒత్తిడి చేశాడు. దీంతో షమీమ్ ఆ యువకుడితో కలిసి స్నానానికి సముద్రంలో దిగాడు.

పోలీసుల విచారణ

పోలీసుల విచారణ

నగరంలో సముద్ర స్నానాలకు దిగిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. ఇందులో ఒకరు పాఠశాల విద్యార్థి కాగా, మరొకరు ఎవరన్నదీ ఇంకా వివరాలు తెలియరాలేదు. వీరి కోసం పోలీసులు సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నారు.

బాధితుల కుటుంబసభ్యులు

బాధితుల కుటుంబసభ్యులు

మురళీనగర్‌లోని అయ్యప్పకాలనీకి చెందిన మహ్మద్ షమిమ్(15) మాధవదార ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.

గాలింపు

గాలింపు

మంగళవారం పాఠశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఉదయం 9గంటలకు సైకిల్‌పై బయటకు వచ్చాడు.

షమిమ్ పాఠశాలకు వెళ్లకుండా సాయికుమార్

షమిమ్ పాఠశాలకు వెళ్లకుండా సాయికుమార్


షమిమ్ పాఠశాలకు వెళ్లకుండా సాయికుమార్, రాములుతో కలిసి సముద్రంలో స్నానం చేసేందుకు ఏయూ మహిళా వసతి గృహం సమీపంలోని తీరానికి చేరుకున్నారు.

గాలింపు

గాలింపు

సముద్రంలో కాసేపు స్నానం చేశారు. అనంతరం ఒడ్డుకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని మరో యువకుడు మహ్మద్ షమీమ్‌ను పిలిచి మళ్లీ స్నానం చేద్దామని రమ్మని ఒత్తిడి చేశాడు. దీంతో షమీమ్ ఆ యువకుడితో కలిసి స్నానానికి సముద్రంలో దిగాడు.

గాలింపు

గాలింపు

ఇంతలో వచ్చిన అలలు ఆ యువకుడ్ని లోపలికి లాక్కెళ్తుండగా.. ఆ యువకుడు షమీమ్‌ చేతిని పట్టుకున్నాడు. దీంతో ఇద్దరూ కూడా సముద్రంలో మునిగిపోయారు.

ఇంతలో భారీగా వచ్చిన అలలు ఆ యువకుడ్ని లోపలికి లాక్కెళ్తుండగా.. ఆ యువకుడు షమీమ్‌ చేతిని పట్టుకున్నాడు. దీంతో ఇద్దరూ కూడా సముద్రంలో మునిగిపోయారు. అక్కడే ఉన్న షమీమ్ స్నేహితులు పెద్దగా కేకలు వేయడం ప్రారంభించారు. అక్కడికి స్థానికులు చేరుకునేప్పటికే ఆ ఇద్దరు నీటిలో పూర్తిగా మునిగిపోయారు.

స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఏసిపి రమణ, మెరైన్ పోలీసులు, బ్లూకోట్స్ పోలీసులు రంగంలోకి దిగి మూడు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వరకూ గాలించినా వారి ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న షమీమ్ తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి వచ్చి బోరున విలిపించారు.

ఇది ఇలా ఉండగా షమీమ్‌తో కలిసి స్నానం చేసిన ఆ యువకుడు ఎవరనేది పోలీసలకు మిస్టరీగా మారింది. అయితే అతను షమీమ్ అన్నయ్య స్నేహితుడని రాము, సాయికిరణ్‌లు చెబుతున్నారు. కానీ, అతడ్ని ఎప్పుడూ చూడలేదని చెబుతుండటంతో అతనెవరనేది తెలియడం లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+