ఇవ్వనంటారా, చిత్తూరుకు వస్తా.. ఇంత నిరంకుశ పాలనా: బాబుపై పవన్ ఆగ్రహం, మోడీ దీక్షపై..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని, ఇళ్లు కూల్చి రోడ్లేస్తాం.. పరిహారం ఇవ్వమని చెబుతున్నారని, తాము అభివృద్ధిని అడ్డుకోవడం లేదని, పరిహారం కోరుతున్నామని, చిత్తూరు హై రోడ్డు బాధితులకు తాను అండగా ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం అన్నారు. ఈ మేరకు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.

చదవండి: కొత్త ఫ్రెండ్‌షిప్!: అదే అసలు పాయింట్.. చంద్రబాబు-రాహుల్ గాంధీ కలుస్తారా?

బాధితులు తన వద్ద వెళ్లబోసుకున్న అంశాలను కూడా జనసేన అధికారిక ఫేస్‌బుక్‌లో పోస్టు చేసారు. తమ భూములు లాక్కుంటే ఊరంతా చచ్చిపోతామని అంటున్నారని పేర్కొన్నారు. ఏపీలో నిరంకుశ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. చిత్తూరు నగరంలో రోడ్ల విస్తరణ కోసం చేస్తున్న భూసేకరణ అంశంపై ఆయన మండిపడ్డారు.

చదవండి: ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా?: అఖిలకు బాబు క్లాస్!, వైసీపీలోకి చల్లా.. రంగంలోకి సీఎం, బుజ్జగింపు

మేమంతా రోడ్డున పడే పరిస్థితి

చిత్తూరు నగరంలో రోడ్ల విస్తరణ కోసం ఐదు కిలో మీటర్ల మేర చేస్తోన్న భూసేకరణకు ఎలాంటి పరిహారం ఇవ్వమని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో తామందరం రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని బాధితులు పవన్ కళ్యాణ్‌కు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకు ఇరువైపులా పేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు, జీవనోపాధి కోసం వేసుకున్న దుకాణాలు ఉన్నాయని, వాటిని తొలగిస్తే అన్యాయం అయిపోతామన్నారు.

కలెక్టర్ భయపెడుతున్నారు

పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం భూమిని సేకరించేటప్పుడు పరిహారం ఇవ్వనవసరం లేదనే ఉత్తర్వు చూపించి రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ బలగాలతో కలెక్టర్ భయపెడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో పవన్‌ని కలిసిన ఓ వ్యక్తి కలిసి తమ సమస్యను వివరించారు.

నంద్యాలలో, విజయనగరంలో ఇచ్చారు, చిత్తూరులో మాత్రం

నంద్యాలలో, విజయనగరంలో ఇచ్చారు, చిత్తూరులో మాత్రం

ఆయన తన సమస్య వివరిస్తూ.. 'చిత్తూరు కలెక్టరేట్ నుంచి వెళ్లే ఈ రోడ్డు విస్తరణలో సుమారు ఐదు వేల మందికి అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కాబట్టి పరిహారం ఇవ్వమంటున్నారు. ఇలాంటి విస్తరణే చేసి శ్రీకాళహస్తిలో డబ్బులు ఇచ్చారు. ఉప ఎన్నికల ముందు నంద్యాలలో పరిహారం ఇచ్చారు... విజయనగరంలో ఇచ్చారు. చిత్తూరులో మాత్రం ఇవ్వం అంటున్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం కోరుతున్నాం' అన్నారు.

చిన్నా చితక కుటుంబాలే

చిన్నా చితక కుటుంబాలే

అబ్దుల్ రెహమాన్ మరో వ్యక్తి తమ పరిస్థితిని వివరిస్తూ 'ఈ రోడ్డు వెంబడి ఉండేది చిన్నాచితకా కుటుంబాలే. ఈ రోడ్డు బదులు మరొక రోడ్డు విస్తరణ చేసినా అభివృద్ధి ఉంటుందని ప్రత్యామ్నాయం చూపించాం. కలెక్టర్ ఆదేశాలతో ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చేందుకు సిబ్బంది వస్తున్నారు' అన్నారు.

కోర్టు చెప్పినా పట్టించుకోవట్లేదు

కోర్టు చెప్పినా పట్టించుకోవట్లేదు

మరో బాధితుడు వెంకటేశం మాట్లాడుతూ 'పట్టణాభివృద్ధికి పరిహారం ఇవ్వక్కర్లేదు అనే ఉత్తర్వును కోర్టు తోసిపుచ్చింది. అయినా ఈ ఉత్తర్వుని చూపిస్తున్నారు. మేము అభివృద్ధిని అడ్డుకోవట్లేదు. మేం అభివృద్ధిని అడ్డుకోవట్లేదు. పరిహారం కోరుతున్నామని హైకోర్టుకు చెప్పాం. కోర్టు మాకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు' అని తెలిపారు.

చిత్తూరు వస్తా, బాసటగా ఉంటా

చిత్తూరు వస్తా, బాసటగా ఉంటా

బాధితులు నష్టపోతుంటే కొంతమంది ప్రయివేటు వ్యక్తులు లాభపడటం అభివృద్ధి కాదని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు. 'అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి.. కానీ, ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలని మానవత్వం లేకపోతే నిరంకుశ పాలన అవుతుంది. అభివృద్ధి జరుగుతున్నపుడు కొంత విధ్వంసం తప్పదు కానీ, అందుకు తగ్గ పరిహారం ఇవ్వాలి. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందే. ఈ సమస్యపై నేను చిత్తూరు వస్తా.. బాధితులకి హామీ ఇచ్చి, న్యాయం జరిగే వరకూ బాసటగా ఉంటాను' అన్నారు.

మోడీ దీక్ష నమ్మశక్యంగా లేదు

అంతకుముందు రోజు ప్రధాని నరేంద్ర మోడీ దీక్షపై స్పందిస్తూ.. ఆయన దీక్ష నమ్మశక్యంగా లేదన్నారు. పార్లమెంటరీ విధానాలపై గౌరవం చూపలేదన్నారు. 16న రాష్ట్ర బందుకు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena chief Pawan Kalyan said that tyrannical rule in Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి