• search
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా?: అఖిలకు బాబు క్లాస్!, వైసీపీలోకి చల్లా.. రంగంలోకి సీఎం, బుజ్జగింపు

|

అమరావతి: మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన సింగపూర్ బయలుదేరడానికి ముందు కర్నాలు జిల్లాకు చెందిన కొందరు పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విభేదాలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

చదవండి: మోడీ! దీక్ష కాదు, రాజీనామా చెయ్: భగ్గుమన్న టీడీపీ, '5 రోజుల్లో 5వికెట్లు ఆశ్చర్యం'

అలాగే, జిల్లాకు చెందిన సీనియర్ పార్టీ నేత చల్లా రామకృష్ణా రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం పైన కూడా ఈ సందర్భంగా చర్చించారు. ఆయన ఎందుకు అసంతృప్తితో ఉన్నారు, ఏం కావాలి అనే అంశాలపై అధినేత ఆరా తీశారని తెలుస్తోంది. కావాలంటే మరో పదవి ఇస్తామని ఆయన చెప్పారని తెలుస్తోంది.

చదవండి: గాంధీని చంపిన గాడ్సే కంటే దారుణం: విజయసాయి షాకింగ్, 'కాంగ్రెస్‌ను సమర్థించేందుకు బాబు వెనుకాడరు!'

ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా?

ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా?

చంద్రబాబు అమరావతి నుంచి బయలుదేరే ముందు కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి అఖిలప్రియ, పార్టీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి తదితరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అఖిలప్రియ - సుబ్బారెడ్డిల మధ్య విభేదాలపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. విభేదాలు వీడి పని చేయాలని ఎన్నిసార్లు సూచించినా వినకపోవడంపై అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

విభేదాలు వీడి పని చేయాలి

విభేదాలు వీడి పని చేయాలి

ఇప్పటికైనా పార్టీ కోసం అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలు విభేదాలు వీడి పని చేయాలని చంద్రబాబు సూచించారు. ఎన్నికల ఏడాది నేపథ్యంలో మరోసారి చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

నంద్యాల ఊపు, ఏవీ సుబ్బారెడ్డికి ప్రాధాన్యత

నంద్యాల ఊపు, ఏవీ సుబ్బారెడ్డికి ప్రాధాన్యత

కొద్ది రోజుల క్రితం జరిగిన నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఎలాంటి ఉత్తేజంతో పని చేశారో ఇప్పుడు కూడా అదే ఊపుతో పని చేయాలని చంద్రబాబు.. అఖిలప్రియ, సుబ్బారెడ్డి, బ్రహ్మానంద రెడ్డిలకు సూచించారు. ఇచ్చిన హామీ మేరకు ఏవీ సుబ్బారెడ్డికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు.

చల్లా రామకృష్ణా రెడ్డి పార్టీ మార్పుపై చర్చ

చల్లా రామకృష్ణా రెడ్డి పార్టీ మార్పుపై చర్చ

జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్లా రామకృష్ణా రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో ఆయనను టిడిపి బుజ్జగిస్తోంది. కడప ఆర్టీసీ రీజియన్ చైర్మన్ పదవి తనకు అవసరం లేదని చల్లా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో చల్లాకు మరో పదవి ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు హామీ ఇచ్చారని సమాచారం.

చిచ్చు పెట్టిన నామినేటెడ్ పోస్టు

చిచ్చు పెట్టిన నామినేటెడ్ పోస్టు

చంద్రబాబు రెండు రోజుల క్రితం నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. చల్లాకు కడప ఆర్టీసీ రీజియన్ చైర్మన్ పదవి ఇచ్చారు. దీని పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు. తనకు పదవి ఇవ్వకపోయినా బాధపడే వాడిని కాదని, కానీ చిన్న పదవి ఇచ్చి అవమానించారని భావిస్తున్నారు. తనకంటే జూనియర్ నేతలకు రాష్ట్రస్థాయి పదవులు ఇచ్చి తనకు ఎగతాళి చేసినట్లు పదవి ఇచ్చారని వాపోతున్నారు.

ఇలాంటి సమయంలో వద్దు

ఇలాంటి సమయంలో వద్దు

తాను కడప ఆర్టీసీ రీజియన్ చైర్మన్ పదవి చేపట్టేది లేదని చల్లా రామకృష్ణా రెడ్డి తేల్చారు. అంతేకాదు, ఆయన పార్టీ మారుతారనే ప్రచారం సాగింది. ఈ విషయమై కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు చర్చించి, ఆయనకు మరో మంచి పదవి ఇస్తామని చెప్పారని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు చల్లా వంటి సీనియర్ నేతలను వెళ్లనీయవద్దని, ఆయనకు మరో పదవి ఇస్తామని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

నాగర్ కర్నూల్ యుద్ధ క్షేత్రం
సంవత్సరం
అభ్యర్థి పేరు పార్టీ లెవెల్ ఓటు ఓటు రేట్ ఓట్ల తేడ
2014
ఎల్లయ్య నంది కాంగ్రెస్ విజేతలు 4,20,075 38% 16,676
డాక్టర్ మండ జగన్నాథ్ టిఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 4,03,399 37% 0

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu class to Bhuma Akhila Priya and AV Subba Reddy. Chandrababu ready to give another post to Challa Ramakrishna Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more