గాంధీని చంపిన గాడ్సే కంటే దారుణం: విజయసాయి షాకింగ్, 'కాంగ్రెస్‌ను సమర్థించేందుకు బాబు వెనుకాడరు!'

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. మహాత్మా గాంధీని చంపడానికి ముందు నాడు నాథూరాం గాడ్సే ఆయన పాదాలకు నమస్కారం చేశారని, ఆ తర్వాత హతమార్చాడని, సీఎం చంద్రబాబు అంతకంటే దారుణమైన వ్యక్తి అన్నారు.

చదవండి: బిజెపి ఎక్కడుంది, ఎవరైనా ఓటేస్తారా, అందుకే కేంద్రంపై తిరుగుబాటు చేశా: చంద్రబాబు సంచలనం

చంద్రబాబు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతారన్నారు. ఆయన చాలా దారుణమైన వ్యక్తి అన్నారు. ఏపీకి హోదా రాకపోవడానికి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీనే కారణం అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాటం కొనసాగుతుందన్నారు. ఆయన ఓ ఛానల్‌తో మాట్లాడారు.

చదవండి: అశోక్ గజపతి రాజుకు చేదు అనుభవం, ఎయిర్ ఇండియా సిబ్బంది షాక్!

స్వార్థ ప్రయోజనాల కోసం ప్యాకేజీకి అంగీకరించారు

స్వార్థ ప్రయోజనాల కోసం ప్యాకేజీకి అంగీకరించారు

ప్రత్యేక హోదా కోసం తాము నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నామని విజయ సాయి రెడ్డి చెప్పారు. గతంలో ఏపీకి హోదా రాకపోవడానికి, అమలు చేయకపోవడానికి కారణం టీడీపీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి, ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ప్యాకేజీ ఒప్పుకున్నారన్నారు.

కాంగ్రెస్ పేరు వినేందుకే ఇష్టపడరు

కాంగ్రెస్ పేరు వినేందుకే ఇష్టపడరు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు వారందరూ కాంగ్రెస్‌కు ఓట్లేయాలనే రీతిలో ఏపీ ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి పరోక్షంగా ఇచ్చిన పిలుపు టీడీపీ స్థాపన స్ఫూర్తికి తూట్లు పొడిచినట్లయిందని, ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి రఘునాథబాబు అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌.. కాంగ్రెస్‌ పేరు వినేందుకూ ఇష్టపడని నేత అన్నారు. దాని పట్ల వ్యతిరేకతే టీడీపీ మౌలిక సిద్ధాంతం అన్నారు.

కాంగ్రెస్‌ని సమర్థించేందుకు బాబు వెనుక చూడాల్సిన పనిలేదు

కాంగ్రెస్‌ని సమర్థించేందుకు బాబు వెనుక చూడాల్సిన పనిలేదు

టీడీపీలోకి ఫిరాయించిన చంద్రబాబు నాయుడు, కెఈ కృష్ణమూర్తిలకు కాంగ్రెస్‌‌ను సమర్థించేందుకు ముందు వెనుకచూడాల్సిన పని లేదని రఘునాథ బాబు అన్నారు. టీడీపీ సిద్ధాంతాలు, విధానాల్ని నమ్మి రాజకీయాల్లోకి ప్రవేశించి, చిరకాలంగా అదే పార్టీలో కొనసాగుతున్న ఇతర నేతలు, కార్యకర్తల శ్రేణి వారి ధోరణిని జీర్ణించుకోలేకపోతోందన్నారు. ఏపీకి కాంగ్రెస్‌ చేసినంత హాని, అంతా ఇంతా కాదన్నారు.

జగన్ పైన అనురాధ ఆగ్రహం

జగన్ పైన అనురాధ ఆగ్రహం

ఇదిలా ఉండగా, జగన్ పైన టీడీపీ మహిళ నేత పంచుమర్తి అనిరూధ మండిపడ్డారు. పాదయాత్రలో జగన్ టీడీపీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. మంగళగిరిలో చేనేత కార్మికులపై జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. చేనేత కార్మికుల రుణమాఫీ ఘనత చంద్రబాబే అన్నారు. వైసీపీ ఎంపీలు చేసింది రాజీనామాలు కాదని, రాజీడ్రామాలు అని టీడీపీ అంటోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party MP Vijaya Sai Reddy shocking comments on AP CM Chandrababu Naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X