తిరుమలలో ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 82,721 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,261 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.46 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తొమ్మిది కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

ఈ నెల 30వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది పండగ. శ్రీ విశ్వావసు నామ ఉగాది పండగను అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు. అదే రోజున వేలాదిమంది భక్తుల సమక్షంలో శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు.
ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఈ నెల 25వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరుగనుంది. ఆ రోజున ఆలయాన్ని శుద్ధి చేస్తారు అర్చకులు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి.. తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు.
ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేస్తారు. సంవత్సరంలో నాలుగుసార్లు అంటే- ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. అలాగే ఈ నెల 30వ తేదీ ఆదివారం నాడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని సహస్ర దీపాలంకార సేవ మినహా అన్ని ఆర్జిత సేవలను రద్దయినట్లు టీటీడీ తెలిపింది.
ఈ నెల 25, 30 తేదీల్లో ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలను కల్పిస్తామని టీటీడీ పేర్కొంది. 24, 29 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకి సంబంధించి ఎటువంటి సిఫారసు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications