తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!!
తెలుగు నూతన సంవత్సరమైన "ఉగాది" పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొని, ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా తినే షడ్రుచుల పచ్చడి జీవితంలోని సుఖదుఃఖాల సంకేతమని ఇద్దరు ముఖ్యమంత్రులు పేర్కొన్నారు. మధురం, కారం, పులుపు, చేదు, ఉప్పు, వగరు వంటి రుచుల మాదిరిగా జీవితం కూడా వివిధ అనుభవాల సమ్మేళనం అని, వాటిని సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు.
చంద్రబాబు ట్వీట్..
షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం.. అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. అలానే ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చారు. పేదరికం లేని సమ సమాజ నిర్మాణం కోసం మనం తలపెట్టిన పీ4 తో బాటు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలని ఆకాంక్షించారు. 'స్వర్ణాంధ్ర విజన్ 2047' విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు.

రేవంత్ రెడ్డి పోస్ట్..
మరోవైపు తెలుగు ప్రజల సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక.. శ్రీ పరాభవ నామ ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఉగాది షడ్రుచుల మాదిరిగానే జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని కోరారు. ప్రకృతి పునరుజ్జీవానికి సంకేతమైన ఈ శుభదినాన్ని ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.
వీరితో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు తెలంగాణ మంత్రులు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తంగా ఉగాది పర్వదినం తెలుగు ప్రజల జీవితాల్లో కొత్త ఆరంభానికి నాంది పలుకుతుందని, ఆశలు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి ఒక్కరికీ విజయం సొంతమవుతుందని ఇద్దరు ముఖ్యమంత్రులు పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఇంటా వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.
షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ… pic.twitter.com/0gfJapsDzU
— N Chandrababu Naidu (@ncbn) March 18, 2026
తెలుగు ప్రజల సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక.. శ్రీ పరాభవ నామ ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు,… pic.twitter.com/Jgfh2dCwqn
— Telangana CMO (@TelanganaCMO) March 18, 2026
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం











Click it and Unblock the Notifications