కొడుకు భార్యపై అత్యాచారం, అతనితో మాట్లాడాలని హెడ్ మాస్టర్ వేధింపు

గుంటూరు: కోడలి పైన మామ అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. భిమినేనివారిపాలెంలో ఇది జరిగింది. భీమినేనివారిపాలెంకు చెందిన ఓ వ్యక్తితో ఓ అమ్మాయికి ఏడాది క్రితం పెళ్లి జరిగింది.

ప్రస్తుతం భర్త, అత్తమామాలతో కలిసి ఆమె ఉంటోంది. వివాహిత భర్త, మామ టైల్స్ తదితర పనులు చేస్తుంటారు. శుక్రవారం వివాహిత అత్త ఆసుపత్రికి, భర్త పనికి వెళ్లాడు. మామ, కోడలు ఇంట్లో ఉన్నారు.

ఇంట్లో పనులు చేసుకుంటున్న కోడలి పైన కన్నేసిన మామ.. ఆమెను గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆత్తకు శనివారం సాయంత్రం విషయం తెలిసింది. అత్త, కోడలు కలిసి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Uncle rapes Daughter in law

ప్రధానోపాధ్యాయురాలి వేధింపులు

రెంటచింతల లూథరన్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పైన పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఓ బాలిక లూథరన్ పాఠశాలలో చదువుతోంది. రమేష్ అనే వ్యక్తి పాఠశాలలో విద్యుత్ పనులు చేసేందుకు వెళ్తుంటాడు.

రమేష్ బాధిత బాలిక పైన కన్నేశాడు. దీనికి ప్రధానోపాధ్యాయురాలు వంత పాటింది. ప్రధానోపాధ్యాయురాలు తన సెల్ ఫోన్‌కు రమేష్ ఫోన్ చేసి బాలికతో మాట్లాడించమని కోరవాడు. ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడమని ఒత్తిడి తెచ్చేది. ఇటీవల బాలికను ఇంటికి తీసుకెళ్లి పని చేయించుకుంది.

మరో సందర్భంలో రమేష్‌తో మాట్లాడమని బాలికకు ప్రధానోపాధ్యాయురాలు చెప్పగా, తాను మాట్లాడలేనని బాలిక చెప్పింది. మాట్లాడకుంటే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించింది. దీంతో, బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధానోపాధ్యాయురాలు, రమేష్ పైన కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+