వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ చెప్తున్నా, అది అనవసరం: రూ.1900 కోట్లపై బాబుకు ఉండవల్లి షాకింగ్ లెక్క

పట్టిసీమ ప్రాజెక్టు పైన తాను చెప్పింది తప్పని తేలితే, చంద్రబాబు ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని, తనది తప్పని నిరూపిస్తే బహిరంగ క్షమాపణకు సిద్ధమని ఉండవల్లి అన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: పట్టిసీమ ప్రాజెక్టు పైన తాను చెప్పింది తప్పని తేలితే, చంద్రబాబు ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని, తనది తప్పని నిరూపిస్తే బహిరంగ క్షమాపణకు సిద్ధమని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం నాడు అన్నారు.

తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు?: ప్రభాస్‌కు గాలమా? తేల్చి చెప్పిన బీజేపీ!

ఆయన రాజమహేంద్రవరంలో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టు అనవసర ప్రాజెక్టు అని తాను మళ్లీ చెబుతున్నానని అన్నారు. ఈ ప్రాజెక్టు పైన తాను చెప్పింది తప్పని తేలితే క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని టిడిపి ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రూ.1600 కోట్లు, పట్టిసీమకు రూ.1400 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నప్పుడు పోలవరానికి రూ.1900 కోట్ల నాబార్డు రుణం ఎందుకో చెప్పాలని విమర్శించారు.

Undavalli counter to Chandrababu on Polavaram funds with Pattiseema.

అలాగే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం శంకుస్థాపన పిఠాపురంలో బదులు అమరావతిలో చేస్తే బాగుండేదన్నారు. సీఎం చంద్రబాబు కేంద్రంతో ఎందుకు రాజీపడుతున్నారో చెప్పాలని నిలదీశారు.

కాగా, పోలవరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్, టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు టిడిపి ఘనత అని ఆ పార్టీ చెప్పడంపై మూడు రోజుల క్రితం కేవీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉందన్నారు.

నోరు జారుతున్నారు..: జగన్‌ను జేసీ దివాకర్ రెడ్డి అంత మాట అనేశారు!

అలాగే, పట్టిసీమ ప్రాజెక్టు వృథా అని వైసిపి, ఉండవల్లి అరుణ్ కుమార్‌లు చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరంకు తాను రూ.1900 కోట్లు వచ్చేలా చేశానని, పోలవరం పూర్తయ్యే దాకా పట్టిసీమ ప్రాజెక్టుని నిర్మించామన్నారు.

దీనిపై ఉండవల్లి లెక్కలు లాగడం గమనార్హం. చంద్రబాబు పోలవరం కోసం తీసుకు వచ్చింది రూ.1900 కోట్లు అయితే, పట్టిసీమకే రూ.1400 కోట్లు ఖర్చయ్యాయని ఎద్దేవా చేశారు. పట్టిసీమను వ్యతిరేకించడంపై టిడిపి నేతలు మండిపడ్డారు.

English summary
Undavalli counter to Chandrababu on Polavaram funds with Pattiseema.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X