నంద్యాలలో టిడిపి గెలుపు వెనుక: ఉండవల్లి షాకింగ్, బాబుకు షాక్, జగన్‌కు ఊరట
Recommended Video

అమరావతి: నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం వెనుక భారీ అవినీతి ఉందని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం అన్నారు.

ఇదీ నంద్యాల గెలుపు వెనుక విషయం
ఉండవల్లి విలేకరులతో మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీకి సంబంధించి రూ.4 వేలు వారి అకౌంట్లలో వేశారన్నారు.

ఆధారాలు అంటూ
ఇందుకు సంబంధించి ఆయన ఆధారాలు అంటూ కాగితాలను ఉండవల్లి చూపించారు. రాష్ట్రవ్యాప్తంగా కేంద్రం నంద్యాల డ్వాక్రా మహిళలకే డబ్బులను అకౌంట్లలో వేశారని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

2019లో నంద్యాల రిపీట్ కాదు
2019లో అద్భుత విజయం సాధిస్తామని చంద్రబాబు భావిస్తున్నారని, కానీ అది కుదరదని ఉండవల్లి అరుణ్ కుమార్ తేల్చి చెప్పారు. నంద్యాలలో జరిగిన అవినీతిని తాము ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

జగన్‌కు అండగా
కాగా, నంద్యాలలో అవినీతితో అధికార టిడిపి గెలిచిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతోంది. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. దీంతో జగన్‌కు ఊరట అని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications