వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి వచ్చినట్లే, జగన్‌కి తెలియట్లే: ఉండవల్లి, పొన్నం సెటైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Undavalli says debate on T Bill is must
హైదరాబాద్: అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ చేపట్టకపోతే విభజన జరిగినట్లే అవుతుందని, ఈ విషయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అర్థం కావడం లేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ శాసన సభ లాబీల్లో అన్నారు. అసెంబ్లీలో బిల్లు ఉండగా ఎలాంటి తీర్మానాలు చేసినా అవి బిల్లు పరిధిలోకి రావని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఉందని కాబట్టి తీర్మానం సాధ్యం కాదన్నారు. ఇప్పుడు బిల్లుపై చర్చ జరిగి మెజార్టీ సభ్యులు వ్యతిరేకిస్తే కేంద్రం పునఃపరిశీలించే అవకాశముందన్నారు.

మేమిచ్చిన రాజ్యాంగం చదవాలి: పొన్నం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం తెలియకుంటే తాము పంపించిన రాజ్యాంగ పుస్తకాన్ని చదవాలని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. జగన్ పార్టీ ఎమ్మెల్యేలు సమైక్య తీర్మానం కోరడం అవివేకమన్నారు. తెలంగాణ బిల్లు పైన అసలు కుట్రదారులు జగన్ పార్టీయే అని ఆరోపించారు. బిల్లు పైన చర్చ జరగాలని, లేకుంటే సీమాంధ్ర ప్రజలకే నష్టమన్నారు.

కుట్రలను ఎదుర్కొంటాం: శ్రీధర్ బాబు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకునే కుట్రను తాము ఎదుర్కొంటామని శ్రీధర్ బాబు అన్నారు. బిల్లు సవరణలపై స్పీకర్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. బిల్లు పైన అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని, ఓటింగ్ కుదరదన్నారు. సవరణలపై స్పీకర్‌కు తాము లేఖ రాశామన్నారు.

తెలంగాణలో పర్యటింటాలని టిటిడిపి నిర్ణయం

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జెఏసితో వెళ్లవద్దని నిర్ణయించుకున్నారు. వారు మంగళవారం టిడిఎల్పీలో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే తెలంగాణలో పర్యటించి పార్టీ వైఖరిని ప్రజలకు వివరించాలని, గతంలో ఐకాసతో వెళ్లి తప్పు చేశామని, ఇప్పుడు సొంతగా వెళ్దామని నిర్ణయించారు.

English summary

 Rajahmundry MP Undavalli Arun Kumar on Tuesday said debate on Telangana Bill is must and should.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X