వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎందుకు చెప్పట్లేదో, కేసులన్నీ బయటపెట్టు: జగన్ ఛార్జీషీట్ల విలువపై ఉండవల్లి షాకింగ్

|
Google Oneindia TeluguNews

అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి ఆధారాలను బయటపెడితే ఎవరు పట్టించుకుంటారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం ప్రశ్నించారు. ఆయన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ విషయమై తాను పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టానన్నారు.

చులకనగా చూశారు, జగన్ అండతో అణగదొక్కాలని: మోడీ-పవన్‌లపై చంద్రబాబుచులకనగా చూశారు, జగన్ అండతో అణగదొక్కాలని: మోడీ-పవన్‌లపై చంద్రబాబు

వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తులపై మాట్లాడుతూ.. జగన్ లక్ష కోట్లు తిన్నాడని టిడిపి సభ్యులు నానాయాగీ చేసేవారన్నారు. అసలు జగన్ మీద మొత్తం పెట్టిన చార్జీషీట్ల విలువ రూ.1300 కోట్లు అన్నారు. పదమూడు ఛార్జీషీట్లలో ఉన్న ఆరోపణలు అవే అన్నారు.

 జగన్ 11 ఛార్జీషీట్లకు రూ.1300 కోట్లు

జగన్ 11 ఛార్జీషీట్లకు రూ.1300 కోట్లు

ఈ మధ్య జగన్‍‌ను విమానాశ్రయంలో కలిశానని ఉండవల్లి చెప్పారు. అన్నా రూ.1300 కోట్లు అంటున్నావు.. రూ.500 కోట్లు క్లియర్ అయిపోయాయని, ఇంకా ఉంది రూ.800 కోట్లేనని తనతో చెప్పారని ఉండవల్లి అన్నారు. రూ.800 కోట్లు ఎక్కడ లక్ష కోట్లు ఎక్కడ అని ప్రశ్నించారు.

జగన్‌కు ఓ సలహా ఇస్తా

జగన్‌కు ఓ సలహా ఇస్తా

తాను వైసీపీ అధినేత జగన్‌కు ఓ సలహా ఇస్తానని, ఆయన తన కేసులన్నింటిని కూడా ప్రజల ముందు పెట్టాలని ఉండవల్లి అన్నారు. ఈ విషయం తాను జగన్‌తో, ఆ పార్టీ వాళ్లతో పలుమార్లు చెప్పానని, జగన్ కూడా అసెంబ్లీలో చెప్పాడట, కానీ తాను వినలేదని చెప్పారు.

 రసీదు ఇచ్చాడుగా, క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది

రసీదు ఇచ్చాడుగా, క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది

కరప్షన్ అంటే ఎవరికైనా ఉపకారం చేసి కొంత డబ్బు తీసుకోవడమని, తండ్రి సీఎం అయినంత మాత్రాన బిజినెస్ చేయవద్దని లేదని, జగన్ రూ.1300 కోట్లు పెట్టుబడి పెట్టారని, లంచం తీసుకున్నవాడు ఎవరైనా ఆ లంచానికి రసీదు ఇస్తాడా అని, జనగ్ వాళ్ళకు షేర్లు ఇచ్చి, రసీదు ఇచ్చాడని, ఇది క్విడ్ ప్రోకో ఎలా అవుతుందని ఉండవల్లి అన్నారు. జగన్ రసీదు ఇచ్చాడు కాబట్టి దొరికాడన్నారు. జగన్ వద్ద ఉన్న డబ్బు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌లో రిజిస్టర్ అయి ఉన్నవే తప్ప ఒక్క రూపాయి ఎక్కువ లేదని, ఈ విషయాన్ని జగన్ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదో అన్నారు. మన వద్ద డబ్బు లేదని తెలిస్తే ప్రమాదమని జగన్ భావిస్తున్నాడేమో అన్నారు.

ఆధారాల కోసం లెటర్ ఆన్‌లైన్ ద్వారా పంపిస్తా

ఆధారాల కోసం లెటర్ ఆన్‌లైన్ ద్వారా పంపిస్తా

పోలవరం విషయమై తాను పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టినా ప్రభుత్వం స్పందించలేదని ఉండవల్లి అన్నారు. ఆధారాలు ఉండటం కోసం తాను ప్రతి లేఖను కూడా ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తుంటానని చెప్పారు. తన లేఖలకు ఏ అధికారి సమాధానం ఇవ్వలేదని, పైగా తిట్టారన్నారు. సమాధానం రానప్పుడు లెటర్లు పంపి ఏం లాభమన్నారు. పోలవరం, అమరావతిల్లో ఇంత అవినీతి బయటపడుతుంటే ప్రభుత్వాలు ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తాయని తాను అనుకోలేదన్నారు. తాను మాట్లాడితే ప్రభుత్వం స్పందించడం లేదని, ప్రతిపక్షం నుంచి కూడా స్పందన కరువైందన్నారు.

 60 ఏళ్లకు వైయస్ ఎలక్షన్ పాలిటిక్స్

60 ఏళ్లకు వైయస్ ఎలక్షన్ పాలిటిక్స్

వైయస్ రాజశేఖర రెడ్డి అరవై ఏళ్లకు ఎలక్షన్ పాలిటిక్స్ నుంచి రిటైర్ అవుతానని ఓ సందర్భంలో చెప్పారని, అది తానే రాశానని ఉండవల్లి చెప్పారు. అరవై ఏళ్ల తర్వాత పార్టీలో పని చేయవచ్చునని, అప్పర్ హౌస్‌కు వెళ్లవచ్చునని, ఎనలక్షన్ పాలిటిక్స్‌లో మాత్రం యువతనే ఉండాలనే దానిని వైయస్ నమ్మారని చెప్పారు.

వైయస్ కన్నా అడుగు ముందుకేశా

వైయస్ కన్నా అడుగు ముందుకేశా

తాను వైయస్ కన్నా ఒకడుగు ముందుకేశానని, నామినేటెడ్ పోస్టుల్లోకి వెళ్లే ఉద్దేశ్యం లేదని, తాను పదేళ్లు ఎంపీగా చేశానని, దానిని పదవిగా భావించలేదని, ఒక ఉద్యోగం భావించానని చెప్పారు. కానీ తనకు సంతృప్తి కలగలేదన్నారు. తొలి విడత కొంత సంతృప్తి ఉన్నా ఆ తర్వాత అంత బాగా లేదన్నారు. జనరేషన్ గ్యాప్ వచ్చిందన్నారు.

English summary
Former MP Undavalli Arun Kumar talks about YS Jagan Mohan Reddy case and polavaram and elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X